Somesekhar
సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ వీడియోలు తాను ఇప్పటికీ చూస్తానని, అతడి బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్. మరి ఆ ప్లేయర్ ఎవరు?
సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ వీడియోలు తాను ఇప్పటికీ చూస్తానని, అతడి బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్. మరి ఆ ప్లేయర్ ఎవరు?
Somesekhar
సచిన్ టెండుల్కర్.. క్రికెట్ గాడ్ గా కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. ఇక మాస్టర్ బ్లాస్టర్ ను చూసే తాము క్రికెట్ లోకి అడుగుపెట్టామని చాలా మంది చెప్పుకొచ్చారు. తన బ్యాటింగ్ తో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న రారాజు సచిన్. ప్రపంచ క్రికెట్ లో వందల కొద్ది రికార్డులను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు ఈ క్రికెట్ దేవుడు. కాగా.. చిన్నప్పుడు తాను సచిన్ ఆట చూస్తూ పెరిగామని పదుల సంఖ్యలో క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆటగాళ్లు చెప్పిన విషయం మనకు తెలియనింది కాదు. కానీ.. ఇప్పటికీ తాను సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ వీడియోలు చూస్తానని, అతడి బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్. మరి సచిన్ బ్యాటింగ్ ను అంతగా ఇష్టపడే ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఆ వివరాలు చూద్దాం.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు కానీ.. అందులో కొందరు మాత్రమే అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి దిగ్గజాల్లో అగ్రస్థానంలో ఉంటాడు భారత దిగ్గజ బ్యాటర్ మస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. అతడు క్రీజ్ లో ఉన్నాడంటే.. ఎంతటి దిగ్గజ బౌలర్ కైనా చెమటలు పట్టాల్సిందే. అంతలా తన బ్యాటింగ్ పవర్ చూపిస్తుంటాడు. ఇదిలా ఉండగా.. సచిన్ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. తాను ఇప్పటికీ సచిన్ బ్యాటింగ్ చేసిన పాత వీడియోలను ఎంతో ఇష్టంగా చూస్తానని చెప్పుకొచ్చాడు ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్.
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో లబుషేన్ మాట్లాడుతూ..”నేను ఇప్పటికీ సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ చేసిన ఓల్డ్ వీడియోలను ఎంతో ఇష్టంగా చూస్తాను. ఎందుకంటే అతడి బ్యాటింగ్ టెక్నిక్ అమోఘం. ఏ బంతిని ఎలా ఆడాలి? ఏ బాల్ ను వదిలేయాలి? అన్న విషయాలను ఆ వీడియోల్లో చూసి నేర్చుకుంటూ.. నా బ్యాటింగ్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఆ పాత వీడియోలు చూడటం వల్ల నా బ్యాటింగ్ ను ఎంతో మార్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు లబుషేన్. ప్రస్తుతం ఆసీస్ స్టార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. సచిన్ కూడా గతంలో లబుషేన్ బ్యాటింగ్ చేస్తుంటే.. తనను తాను చూసుకున్నట్లు ఉందని చెప్పుకొచ్చాడు. మరి లబుషేన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.