SNP
Australian Media, Team India, IND vs SA, T20 World Cup 2024: సౌతాఫ్రికాపై ఫైనల్‌లో గెలిచి టీ20 వరల్డ కప్ కైవసం చేసుకున్న భారత జట్టుపై ఆసీస్ మీడియా అర్థంలేని విమర్శలు చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. కుళ్లును వెల్లగక్కుతోంది. ఇంతకీ ఆ కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Australian Media, Team India, IND vs SA, T20 World Cup 2024: సౌతాఫ్రికాపై ఫైనల్‌లో గెలిచి టీ20 వరల్డ కప్ కైవసం చేసుకున్న భారత జట్టుపై ఆసీస్ మీడియా అర్థంలేని విమర్శలు చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. కుళ్లును వెల్లగక్కుతోంది. ఇంతకీ ఆ కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి.. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆట తీరుతో ఓటమి అనేదే లేకుండా కప్పు కొట్టింది. ఫైనల్‌లో వరకు ఓటమి ఎరుగని జట్టుగా వచ్చిన పటిష్టమైన సౌతాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా అవతరించింది. టీమిండియా సాధించిన ఈ అద్భుత విజయం చూసి ఆసీస్ మీడియా ఓర్వలేకపోతుంది. భారత్ జట్టు విజయంపై విషం చిమ్ముతూ కథనాలు ప్రచూరిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా తన బలంపై గెలవలేదని, ఏదో సౌతాఫ్రికా ఒత్తిడికి గురి కావడంతోనే టీమిండియా గెలిచిందంటూ ఒక కథనం ముద్రించింది. ఇప్పుడనే కాదు.. గతంలో అనేక సార్లు టీమిండియాపై, టీమిండియా క్రికెటర్లపై ఆసీస్ మీడియా ఇలాగే అర్థంలేని కథనాలు రాసింది.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు అన్ని కలిసొచ్చాయని, అలాగే అంపైర్ల నిర్ణయాలు కూడా టీమిండియా విజయానికి కారణం అయ్యాయంటూ విమర్శలు గుప్పించింది. సౌతాఫ్రికాపై టీమిండియా విజయాన్ని హేళన చేసేలా కథనాలు ప్రచురించిన ఆసీస్ మీడియా, ఫైనల్ మ్యాచ్ కంటే ముందు కూడా ఇలా కథనాలే రాసింది. బీసీసీఐ బలమైన బోర్డుగా ఉంటూ ఐసీసీని శాసిస్తోందని, అందుకే తమకు అనుకూలంగా షెడ్యూల్‌తో ఫైనల్ చేరిందని విమర్శలు గుప్పించింది. ఆసీస్ మీడియా కథనాలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
ఫైనల్‌లో సౌతాఫ్రికా ఒత్తిడికి గురై ఓడిపోతే.. మరి సూపర్ 8 చివరి మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియా ఎందుకు గెలవలేకపోయిందని గట్టి కౌంటర్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి తమ జట్టును ఇంటికి పంపేందుకు ఇండియానే ప్రధాన కారణం అని భావించిన ఆసీస్ మీడియా ఈ విధంగా తమ కుళ్లును వెల్లగక్కుతుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. పాకిస్థాన్ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా సైతం టీమిండియా విజయాన్ని కొనియాడాయి. తీవ్ర ఒత్తిడిలోనూ.. భారత జట్టు సమిష్టిగా రాణించి, అద్భుత విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచిందంటూ పేర్కొన్నాయి. కానీ, ఆసీస్ మాత్రం ఇలా విషం చిమ్ముతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not too sure about it. The Australian media is the same. They keep writing long articles on pitches when Aus travels India. Or look at Fox sports, they were trying to discredit the india win by raising Q on SKY catch.
— Harshit Anand (@imHarshitAnand) July 1, 2024