అలా అయితే విరాట్ కోహ్లీ టీమ్ లో ఉండి దండగే.. ఆసీస్ దిగ్గజం కామెంట్స్!

విరాట్ కోహ్లీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ అలా చేయకపోతే అతడు టీమ్ లో ఉండి దండగే అన్నాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ అలా చేయకపోతే అతడు టీమ్ లో ఉండి దండగే అన్నాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభమైన తర్వాత కూడా దిగ్గజాల ప్రిడెక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియాపై వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అండ్ మాజీ దిగ్గజాలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ టీమిండియా జట్టు కూర్పుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి తన ప్రిడిక్షన్ చెప్పుకొచ్చాడు. కోహ్లీని ఆ స్థానంలో బ్యాటింగ్ కు పంపకపోతే.. అతడు జట్టులో ఉండి దండగే అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కంటే ముందు నుంచే టీమిండియా ఓపెనింగ్ జోడీపై రకరకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై దిగ్గజాలు సైతం తమ ప్రిడిక్షన్ వెల్లడించారు. చాలా మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అదేంటంటే? ఓపెనర్ గా విరాట్ కోహ్లీ-యశస్వీ జైస్వాల్ ను పంపాలని. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో టీమిండియా జట్టు కూర్పుపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్.

 

“జట్టులో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది. పైగా వరుసగా ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లను పంపలేం. అందుకే యశస్వీ జైస్వాల్ తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలి. లేదంటే అతడికి నా టీమ్ లో చోటే లేదు. అదీకాక అతడు టీమ్ లో ఉండి దండగే. ప్రస్తుతం భీకరఫామ్ లో ఉన్న అతడు ఓపెనర్ గా రావాలి. ఇక కెప్టెన్ రోహిత్ విలక్షణమైన ఆటగాడు. అతడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి రాణించాడు. ఇది టీమిండియా మేనేజ్ మెంట్ ఓసారి ఆలోచించాలి” అంటూ ఆసీస్ దిగ్గజం పేర్కొన్నాడు. మరి హెడెన్  అన్నట్లుగా కోహ్లీని ఓపెనర్ గా పంపిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments