iDreamPost
android-app
ios-app

Nathan Lyon: పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌ చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌! 501*

పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Nathan Lyon: పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌ చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌! 501*

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. సచిన్, గంగూలీ, కపిల్ దేవ్, రికీ పాంటింగ్, వీవీ రిచర్డ్స్ లాంటి లెజెండరీలు తమ బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తే.. ఇక మెక్ గ్రాత్, బ్రెట్ లీ, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే లాంటి ఎందరో బౌలర్లు తమ బంతులతో బ్యాటర్ల భరతం పట్టారు. కాగా.. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. కొందరు బ్యాటర్లు, బౌలర్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నారు. తాజాగా మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో పాక్ పై ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు ఆసీస్ స్టార్ బౌలర్ నాథన్ లియోన్.

పాకిస్థాన్ తో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఈ పోరులో అన్ని విభాగాల్లో కంగారూ టీమ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. లియోన్ కంటే ముందు ఆసీస్ తరఫున దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మెక్ గ్రాత్ మాత్రమే ఈ ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు. వారి తర్వాత కంగారూ టీమ్ నుంచి ఈ రికార్డు సాధించిన ప్లేయర్ గా లియోన్ చరిత్రకెక్కాడు.

ఇక ఈ మ్యాచ్ లో నాథన్ లియోన్ మెుత్తంగా 5 వికెట్లు పడగొట్టి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 133 టెస్టుల్లో 800 వికెట్లు తీశాడు. ఆ తర్వాత షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(690), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్(604), గ్లెన్ మెక్ గ్రాత్(563), కోట్నీ వాల్ష్(519) వికెట్లతో లియోన్ కంటే ముందున్నారు. షేన్ వార్న్ వారసుడిగా జట్టులోకి వచ్చిన నాథన్ ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 487, రెండో ఇన్నింగ్స్ లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 271, 89 రన్స్ చేసి చిత్తుగా ఓడిపోయింది. మరి 500 వికెట్ల క్లబ్ లో చేరిన నాథన్ లియోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి