ప్రస్తుత క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాను చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలపడినా భలే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గ్రౌండ్లోకి దిగితే కొదమ సింహాల్లా పోరాడే ఈ జట్ల మధ్య జరిగే సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇది మరోమారు నిరూపితమైంది. సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారుతోంది. రెండో వన్డేలో కంగారూ జట్టు 392 రన్స్ చేయగా.. మూడో మ్యాచ్‌లో సఫారీ టీమ్ 338 పరుగులు చేసింది. నాలుగో వన్డేలో అయితే ఏకంగా 416/5 రన్స్ చేసింది.
నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 416 రన్స్ చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (45), రీజా హెండ్రిక్స్ (28) శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన వాండర్ డస్సెన్ (62) కూడా రాణించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (84 బంతుల్లో 147) అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 13 ఫోర్లు, 13 సిక్సులతో ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు. క్లాసెన్‌కు తోడుగా డేవిడ్ మిల్లర్ (45 బంతుల్లో 82) కూడా చెలరేగడంతో సఫారీ టీమ్ 416 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ 252 రన్స్‌కే కుప్పకూలింది.
కంగారూ టీమ్‌లో అలెక్స్ క్యారీ (99) ఒక్కడే రాణించాడు. టిమ్ డేవిడ్ (35) క్రీజులో నిలదొక్కుకున్నట్లే కనిపించినా అతడ్ని లుంగీ ఎంగిడీ వెనక్కి పంపాడు. మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న క్యారీ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ గాయపడటం కంగారూ టీమ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ కూడా గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేతికి గాయంతో హెడ్ కూడా ఆ జాబితాలో చేరాడు. వచ్చే వరల్డ్ కప్‌లో అతడు ఆడేది లేనిది అనుమానంగా మారింది. ప్రపంచ కప్‌కు ముందు ఇలా కీలక ప్లేయర్లకు వరుస గాయాలు అవ్వడం ఆసీస్ శిబిరాన్ని కలవరపెడుతోంది. వరల్డ్ కప్ నాటికి ఈ ఆటగాళ్లు కోలుకుంటారో లేదో చూడాలి.
ఇదీ చదవండి: గిల్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హిట్‌మ్యాన్!
Travis Head doubtful for the 2023 World Cup due to hand fracture.
Smith, Cummins, Starc, Maxwell, Green and now Head – the list keeps getting bigger for Australia! pic.twitter.com/pMhhiQqNB9
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2023