Nidhan
ఒక స్టార్ క్రికెటర్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్ అందించిన ఆ ప్లేయర్ గుడ్‌బై చెప్పడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
ఒక స్టార్ క్రికెటర్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్ అందించిన ఆ ప్లేయర్ గుడ్‌బై చెప్పడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
Nidhan
ఆటగాళ్లు అన్నాక రిటైర్మెంట్ తీసుకోవడం అనేది సర్వసాధారణమే. ఎంతటి ప్లేయర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. శరీరం సహకరించినంత కాలం, ఫామ్‌లో ఉన్నన్ని రోజులు ఆడతారు. ఆ తర్వాత గేమ్ నుంచి తప్పుకుంటారు. అయితే కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుంటే అభిమానులు, ప్రేక్షకులు తట్టుకోలేరు. ఇన్ని రోజులు అద్భుతమైన ఆటతీరుతో తమను ఇంతగా అలరించిన వారు తర్వాతి రోజు నుంచి గ్రౌండ్లో కనబడరనే విషయం విని షాకవుతారు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని కోరతారు. ఇక, క్రికెట్లో గ్రేట్ ఓపెనర్స్‌లో ఒకడిగా పేరు సంపాదించిన ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు మరో షాకింగ్ డెసిజన్ తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు వార్నర్.
టీమిండియాపై వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఈ తరుణమే గేమ్‌కు ముగింపు పలకించేందుకు సరైన టైమ్‌గా భావిస్తున్నట్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు వార్నర్. వన్డేల నుంచి తాను తప్పుకోవడం వల్ల కొత్తవారికి ఛాన్సులు లభిస్తాయని తెలిపాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు ఈ డాషింగ్ ఓపెనర్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్ వార్నర్ కెరీర్లో ఆఖరిది కానుంది. అయితే, వన్డే రిటైర్మెంట్పై డేవిడ్ భాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2025లో పాక్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే తాను రీఎంట్రీ ఇస్తానని చెప్పాడు. స్వదేశంలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో కంటిన్యూ అవుతానని స్పష్టం చేశాడు వార్నర్. టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడేందుకు తనకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేసుకున్నాడు.
ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2023 వన్డే వరల్డ్ కప్‌లో కంగారూ జట్టు కప్పు కొట్టడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సహా మొత్తంగా 528 రన్స్ చేశాడు. టీమ్ నుంచి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్ ప్లేయర్ విఫలమైనా వార్నర్ రాణించడంతో ప్రపంచ కప్‌లో ఆ లోటు కనిపించలేదు. డేవిడ్ భాయ్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. అతడు మొత్తంగా 161 మ్యాచులు ఆడి 6,932 పరుగులు చేశాడు. 45.3 యావరేజ్‌తో రన్స్ చేశాడు. అతడి బెస్ట్ స్కోర్ 179. కెరీర్లో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. టెస్టులతో పాటు అనూహ్యంగా వన్డేల నుంచి కూడా వార్నర్ తప్పుకోవడంతో అతడి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. 2015, 2023 వన్డే వరల్డ్ కప్స్‌ను ఆసీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్‌కు ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉందని అంటున్నారు. మరి.. వార్నర్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Wasim Akram: PSL-IPL గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ లెజెండ్ వసీం అక్రమ్
David Warner has announced his retirement from ODI cricket.
One of the finest ever of the format, Thank you Davey…!!! 🫡 pic.twitter.com/6v6nRjwniN
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2024