David Warner: వార్నర్ కోసం గ్రౌండ్​లోకి వేలాది జనం.. మళ్లీ గోల్డెన్ డేస్​ను గుర్తుచేశారు!

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్​లో చివరి టెస్ట్ ఆడేశాడు. పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ అతడికి ఆఖరిదిగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ పూర్తయ్యాక జరిగిన ఓ ఘటన పాత రోజుల్ని గుర్తుచేసింది.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్​లో చివరి టెస్ట్ ఆడేశాడు. పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ అతడికి ఆఖరిదిగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ పూర్తయ్యాక జరిగిన ఓ ఘటన పాత రోజుల్ని గుర్తుచేసింది.

క్రికెట్​లో సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో దాదాపుగా అన్ని జట్లూ ఒకేతీరుగా ఆడతాయి. బౌలింగ్ విషయాన్ని పక్కనబెడితే.. బ్యాటింగ్​లో మాత్రం ఎక్కువగా డిఫెన్సివ్ అప్రోచ్​నే ఫాలో అవుతాయి. పిచ్ ప్రవర్తిస్తున్న తీరును బట్టి గేమ్ ప్లాన్​ను సెట్ చేసుకుంటాయి. ఒక్కో రన్​తో ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయడం, వికెట్లను కాపాడుకోవడం, ఆ తర్వాత భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నించడం.. అన్ని టీమ్స్​ది ఇదే ఫార్ములా. కానీ గేమ్​ ఆడే తీరును మార్చే కొందరు ప్లేయర్లు అప్పుడప్పుడు వస్తుంటారు. అలా వచ్చిన వాడే డేవిడ్ వార్నర్. ఓపెనర్​గా క్రీజులోకి దిగి థండర్ ఇన్నింగ్స్​లతో అపోజిషన్ బౌలర్లపై విరుచుకుపడటం వార్నర్ స్టైల్. అతడు ఆడుతుంటే అవి టెస్టులా? టీ20లా? అనే డౌట్ రాక మానదు. పొట్టి ఫార్మాట్ స్టైల్​ను లాంగ్ ఫార్మాట్​కు అడాప్ట్ చేసుకొని ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించడంలో అతడు ఆరితేరాడు. అలాంటి డేవిడ్ భాయ్ తన కెరీర్​లో ఆఖరి టెస్ట్ ఆడేశాడు. అతడ్ని చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.

టెస్టుల్లో ఓపెనర్​గా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్​లు ఆడి ఆసీస్​కు మర్చిపోలేని విక్టరీలు అందించాడు వార్నర్. అయితే ఇవాళ అతడు తన చివరి మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్​లో పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్ట్​ అతడికి ఆఖరిది. అయితే లాస్ట్ టెస్ట్ ఆడుతున్న వార్నర్​ను చూసేందుకు వేలాది మంది ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు. డేవిడ్ భాయ్ బ్యాటింగ్​కు దిగినప్పుడు ‘వార్నర్.. వార్నర్’ అంటూ ఉత్సాహరిచారు. సెకండ్ ఇన్నింగ్స్​లో అతడు ఔటై వెళ్లిపోతున్న టైమ్​లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తమ అభిమాన క్రికెటర్​ను మళ్లీ వైట్ జెర్సీలో చూడలేమనే విషయాన్ని తలచుకొని కొందరు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పాక్ విసిరిన టార్గెట్​ను ఆసీస్ రీచ్ అయ్యాక సంతోషం తట్టుకోలేక ఒకేసారి వేలాది మంది జనాలు గ్రౌండ్​లోకి దూసుకొచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.

జనాలంతా ఒకేసారి గ్రౌండ్​లోకి అడుగుపెట్టడంతో భద్రతా సిబ్బందికి ఏం చేయాలో తోచలేదు. అయితే ఎలాగోలా వారిని నియంత్రించారు. ఆ తర్వాత తాళ్లను తీసుకొచ్చి పిచ్ దగ్గరకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ గ్రౌండ్​లో నుంచి ప్రేక్షకులను పూర్తిగా బయటకు పంపలేదు. మైదానంలో వేలాది మంది జనం మధ్యే ట్రోఫీ బహూకరణ కార్యక్రమం నిర్వహించారు. తనను అభిమానించే ప్రేక్షకుల మధ్య రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తూ వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. గ్రౌండ్​లోకి వేలాది మంది దూసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పాత రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు. 80, 90వ దశకాల్లో జట్లు మ్యాచ్ గెలిస్తే ప్రేక్షకులు మైదానంలోకి పరిగెత్తుకొచ్చేవారు. 1983 వరల్డ్ కప్​ను భారత్ గెలుచుకున్న టైమ్​లోనూ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న వాళ్లంతా సంతోషం పట్టలేక మైదానంలోకి దూసుకొచ్చారు. అయితే చాన్నాళ్ల తర్వాత మళ్లీ అలా జరగడంతో గోల్డెన్ డేస్​ గుర్తుకొస్తున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వార్నర్ కోసం వేలాది మంది గ్రౌండ్​లోకి రావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs SA: పిచ్​ క్యూరేటర్​పై అనుమానాలు.. అతడు కావాలనే చేశాడంటూ..!

Show comments