iDreamPost

IND vs SA: పిచ్​ క్యూరేటర్​పై అనుమానాలు.. అతడు కావాలనే చేశాడంటూ..!

  • Published Jan 05, 2024 | 8:17 PMUpdated Jan 05, 2024 | 8:17 PM

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్​లో ప్రొటీస్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన కేప్​టౌన్ పిచ్​ క్యూరేటర్​పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్​లో ప్రొటీస్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన కేప్​టౌన్ పిచ్​ క్యూరేటర్​పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published Jan 05, 2024 | 8:17 PMUpdated Jan 05, 2024 | 8:17 PM
IND vs SA: పిచ్​ క్యూరేటర్​పై అనుమానాలు.. అతడు కావాలనే చేశాడంటూ..!

భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ ముగిసింది. సెంచూరియన్​లో జరిగిన మొదటి మ్యాచ్​లో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లతో నిండిన టీమిండియా తీవ్రంగా విమర్శల పాలైంది. అయితే వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన రోహిత్ సేన కేప్​టౌన్ ఆతిథ్యం ఇచ్చిన చివరి టెస్ట్​లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో మూడ్రోజులు మిగిలి ఉండగానే విక్టరీని నమోదు చేసి సిరీస్​ను 1-1తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యంత తక్కువ టైమ్​లో ముగిసిన మ్యాచ్​గా ఇది రికార్డు సృష్టించింది. గ్రాండ్ విక్టరీతో జోష్​ మీద ఉన్న టీమిండియా.. నెక్స్ట్ సిరీస్​పై ఫోకస్ చేస్తోంది. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని సౌతాఫ్రికా మాత్రం ఓటమికి సాకులు వెతుకుతోంది. అతడి వల్లే ఓడామంటూ విమర్శలు చేస్తోంది.

కేప్​టౌన్ టెస్ట్​లో పిచ్ క్యూరేటర్ తప్పిదం వల్లే ఓడామంటూ సఫారీ జట్టు చెబుతోంది. అతడి అత్యుత్సాహం తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా మాజీలు ఆరోపిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లతో పాటు స్వయంగా ప్రొటీస్ టీమ్ మేనేజ్​మెంట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. టీమిండియాను త్వరగా ఓడించాలనే పిచ్ క్యూరేటర్ అత్యుత్సాహం తమను ఇబ్బందుల్లోకి నెట్టిందనే భావన సౌతాఫ్రికా జట్టులో వ్యక్తమవుతోంది. దీనికి కోచింగ్ స్టాఫ్​ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పొచ్చు. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్​కు వచ్చాడు ప్రొటీస్ బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్స్. అయితే ఈ పిచ్ గురించి అతడి వద్ద సమర్థించుకోవడానికి ఏమీ లేకపోయింది. పిచ్ ఇంత ఫాస్ట్​గా, అనూహ్యమైన బౌన్స్​తో ఉంటుందనే విషయం తనకే తెలియదన్నాడు. ఒకవేళ దీని గురించి తెలిసి ఉంటే స్పిన్నర్ కేశవ్ మహారాజ్​ను ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించాడు. షాన్ పొలాక్, డేల్ స్టెయిన్ సహా చాలా మంది సౌతాఫ్రికా మాజీలు ఈ పిచ్​పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పిచ్ క్యూరేటర్ నిర్లక్ష్యం వల్లే ఆతిథ్య జట్టు ఓడిందంటున్నారు సౌతాఫ్రికా మాజీలు. అయితే భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాత్రం దీన్ని ఖండించాడు. టెస్ట్ క్రికెట్ అంటే ఇలాగే ఉంటుందన్నాడు. క్రికెటర్స్​ను టెస్ట్ చేయడమే ఈ ఫార్మాట్ అసలైన ఉద్దేశమన్నాడు. ఇక, కేప్​టౌన్ పిచ్ మీద రన్స్ చేసేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 55 రన్స్​కే ఆలౌట్ అయింది. మొదటి రోజు ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగిసింది. దీంతో పిచ్ క్యూరేటర్​ను అందరూ టార్గెట్ చేసుకుంటున్నారు. సౌతాఫ్రికా టీమ్ మేనేజ్​మెంట్​తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు క్యూరేటర్​ను తిట్టిపోస్తున్నారు. ఇదంతా చూస్తున్న భారత ఫ్యాన్స్ మాత్రం మంచి పనైందని అంటున్నారు. ఇండియాను ఓడించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ పేస్, బౌన్స్ ఉన్న పిచ్​ను తయారు చేయించారని.. కానీ అదే ప్లాన్ వాళ్లకు తిప్పికొట్టిందన్నారు. ఓటమి బాధను తట్టుకోలేక పిచ్ క్యూరేటర్ మీద నెపం వేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పిచ్ క్యూరేటర్​పై సౌతాఫ్రికా అనుమానాలు వ్యక్తం చేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: 2007 టీ20 వరల్డ్ కప్ హీరోపై కేసు! నాడు గెలిపించి.. నేడు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి