కమిన్స్ హ్యాట్రిక్​తో మురిసిపోతున్న భారత్.. కప్ మనదే అంటున్న ఫ్యాన్స్!

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్​తో చెలరేగాడు. బంగ్లాదేశ్​తో జరిగిన సూపర్-8 ఫైట్​లో అతడు అద్భుతమైన బౌలింగ్​తో అందరి మనసులు దోచుకున్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్​తో చెలరేగాడు. బంగ్లాదేశ్​తో జరిగిన సూపర్-8 ఫైట్​లో అతడు అద్భుతమైన బౌలింగ్​తో అందరి మనసులు దోచుకున్నాడు.

పొట్టి కప్పులో టీమిండియాలాగే ఆస్ట్రేలియా కూడా అదరగొడుతోంది. గ్రూప్ స్టేజ్​లో వరుస విజయాలతో రఫ్ఫాడించిన కంగారూలు.. సూపర్-8 స్టేజ్​ను కూడా అంతే సక్సెస్​ఫుల్​గా స్టార్ట్ చేశారు. బంగ్లాదేశ్​తో ఇవాళ జరిగిన సూపర్ పోరులో ఆ టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాను 140 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. ఆ తర్వాత 11.2 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఉంది. ఆ సమయంలో మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు అంపైర్లు. డక్​వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 28 రన్స్ తేడాతో ఆ టీమ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్​లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ స్పెషల్ హైలైట్​గా నిలిచింది. 4 ఓవర్లు వేసిన అతడు 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహ్దీ హసన్​ను పెవిలియన్​కు పంపించాడు కమిన్స్. 18వ ఓవర్​లో వరుస బంతుల్లో ముగ్గుర్నీ వెనక్కి పంపించి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ప్రస్తుత ప్రపంచ కప్​లో ఇది ఫస్ట్ హ్యాట్రిక్ కాగా.. ఓవరాల్​గా టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఏడోది. ఆస్ట్రేలియా తరఫున మెగా టోర్నీలో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్​గా కమిన్స్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు 2007 టీ20 ప్రపంచ కప్​లో బ్రెట్​లీ హ్యాట్రిక్ తీశాడు. కమిన్స్ హ్యాట్రిక్ తీయడం, మ్యాచ్​లో గ్రాండ్ విక్టరీ కొట్టడంతో కంగారూ జట్టు సంతోషంలో మునిగిపోయింది. అయితే అతడి హ్యాట్రిక్​ను టీమిండియా ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కమిన్స్ పెర్ఫార్మెన్స్​ సూపర్బ్ అంటూ మురిసిపోతున్నారు. ఆసీస్ బౌలర్ రాణిస్తే భారత అభిమానులు ఎందుకు సంతోషంగా ఉన్నారనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం.. టీ20 ప్రపంచ కప్​ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది.

టీ20 వరల్డ్ కప్ స్టార్టింగ్ ఎడిషన్​లో ఆసీస్ బౌలర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ తీశాడు. ఆ ఏడాది టీమిండియా టైటిల్ గెలిచింది. ఇప్పుడు రెండోమారు కంగారూ బౌలర్ హ్యాట్రిక్ తీయడంతో ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భారత అభిమానులు భావిస్తున్నారు. అప్పుడు బ్రెట్ లీ, ఇప్పుడు కమిన్స్.. ఇద్దరూ బంగ్లాదేశ్ మీదే హ్యాట్రిక్ వికెట్లు సాధించడం కూడా వారి నమ్మకానికి మరింత బలం చేకూర్చుతోంది. క్రికెట్​లో సెంటిమెంట్స్ ఎక్కువనేది తెలిసిందే. ఫ్యాన్స్ వీటిని బాగా నమ్ముతారు. అలాంటి వాళ్లు తాజా హ్యాట్రిక్ గురించి తెలిసి భారత్​దే కప్పు అని బల్ల గుద్ది చెబుతున్నారు. ఈసారి రోహిత్ సేనదే టైటిల్ అని చెప్పడానికి అనేక విషయాలు కలిసొస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. సెంటిమెంటే కాదు.. మెన్ ఇన్ బ్లూ ఆటతీరు కూడా అద్భుతంగా ఉందని, మనల్ని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు. మరి.. హ్యాట్రిక్ సెంటిమెంట్ భారత్​కు కలిసొస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments