iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. సౌత్ ఆఫ్రికా చేసిన తప్పులు ఇవే!

నవంబర్ 19న ఆస్ట్రేలియా- భారత్ మధ్య తుదిపోరు జరగనుంది. సౌత్ ఆఫ్రికా గనుక నాకౌట్ మ్యాచ్ లో గెలిచుంటే మన పని ఇంకా సులువయ్యేది. కానీ, ఈ తప్పులు చేయడం వల్ల సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయింది.

నవంబర్ 19న ఆస్ట్రేలియా- భారత్ మధ్య తుదిపోరు జరగనుంది. సౌత్ ఆఫ్రికా గనుక నాకౌట్ మ్యాచ్ లో గెలిచుంటే మన పని ఇంకా సులువయ్యేది. కానీ, ఈ తప్పులు చేయడం వల్ల సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయింది.

ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. సౌత్ ఆఫ్రికా చేసిన తప్పులు ఇవే!

వరల్డ్ కప్ 2023లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 19న అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్- ఆస్ట్రిలేయా జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఒప్పుకోవడానికి కాస్త కష్టంగా ఉన్నా కూడా ఈ మ్యాచ్ టీమిండియాకి అంత ఈజీ కాదు. నిజానికి సౌత్ ఆఫ్రికా గనుక ఆస్ట్రేలియా మీద విజయం సాధించి ఉండుంటే.. ఫైనల్ లో మన పని ఇంకా సులువు అయ్యేది. కానీ, సౌత్ ఆఫ్రికా జట్టు చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు మనల్ని రిస్క్ లో పడేశాయి. మరి.. ఆ తప్పులేంటి? గెలిచే స్కోప్ ఉన్న మ్యాచ్ లో ఎందుకు సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయిందో చూద్దాం.

నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఎప్పటికైనా ప్రమాదకారే. అలాగని సౌత్ ఆఫ్రికాని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా తక్కువేం కాదు. నిజానికి గెలవాల్సిన మ్యాచ్ లో చేతులారా ఓడిపోయారు. నిజానికి వాళ్లు చేసిన స్కోర్ చాలా తక్కువ. అయినా గట్టిగా పోరాడారు. ఒకానొక సమయంలో తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కూడా. కానీ, కొన్ని తప్పులు చేసి మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా.. వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. కొన్ని కొన్ని తప్పులు తెలిసి కూడా చేశారు. ముఖ్యంగా ఒత్తిడిని అధిగమించలేకపోయారు. మార్కరమ్ అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.

స్పిన్ లేటుగా తీసుకొచ్చారు:

సాధారణంగా పవర్ ప్లేలో పేస్ తో అటాక్ చేస్తారు. ఎక్కడా కూడా బ్యాట్ మన్లకు పరుగులు చేసే ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా ఫీల్డింగ్ సెట్ చేస్తారు. అయితే కొన్నిసార్లు అది వర్కౌట్ కాదు. పేస్ గనుక తేలిపోతే వెంటనే వ్యూహం మార్చాలి. అందుకు ఉదాహరణగా తొలి సెమీస్ లో న్యూజిలాండ్ జట్టు తీసుకున్న నిర్ణయాన్ని చెప్పచ్చు. బౌల్ట్, సౌధీ ప్రభావం చూపలేకపోయిన సమయంలో వెంటనే శాంట్నర్ ని తీసుకొచ్చారు. నిజానికి శాంట్నర్ కూడా ప్రభావం చూపలేదు. కానీ, వ్యూహం మార్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ, సౌత్ ఆఫ్రికా జట్టు నుంచి అది మిస్ అయ్యింది. పేస్ ప్రభావం లేనప్పుడు వెంటనే స్పిన్ ని తీసుకొచ్చుంటే బాగుండేది. కాస్త స్కోర్ ని కట్టడి చేయగలిగేవాళ్లేమో?

క్యాచులు మిస్:

ఒక జట్టు విజయం సాధించాలి అంటే ముఖ్యంగా సరైన సమయానికి వికెట్లు తీయగలగాలి. అలా తీయాలి అంటే కట్టుదిట్టమైన ఫీల్డింగ్ ఉండాలి. ఆ విషయంలో సౌత్ ఆఫ్రికా కచ్చితంగా వెనుకపడింది. ముఖ్యంగా క్యాచులు మిస్ చేశారు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్.. క్యాచులు మిస్ చేయబట్టే మ్యాచ్ దూరమైంది. మార్కరమ్ వేసిన బంతికి డికాక్ క్యాచ్ మిస్ చేస్తే.. కింద కూర్చుని ఏడ్చాడు కూడా. ఈ మ్యాచ్ పరాజయంలో క్యాచులు మిస్ చేయడం కూడా ప్రధానం చేసిన తప్పు.

టాపార్డర్ ఫెయిల్:

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టాపార్డర్ కుప్పకూలింది. మరీ ఘోరంగా విఫలమైంది. టాపార్డర్ లో ఉన్న నలుగురు బ్యాటర్లు కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగారు. డికాక్(3), బవుమా(0), డస్సెన్(6), మార్కరం(10) మాత్రమే చేయగలిగారు. అలాగే నిలకడగా ఆడాల్సిన క్లాసెన్ కాస్త దూకుడు పెంచాడు. జాగ్రత్తగా ఆడాల్సిన సమయంలో కొంచం అజాగ్రత్తను ప్రదర్శించాడు. అది కూడా వీళ్ల ఓటమిలో కీలకపాత్ర పోషించింది. మిల్లర్ కి జోడీగా క్లాసెన్ గనుక నిలకడగా ఆడుంటే సౌత్ ఆఫ్రికా స్కోర్ కచ్చితంగా 250 దాటేది. అంటే పోరాడేందుకు ఇంకాస్త సమయంలో దక్కేది. ఆ పాయింట్లో టాపార్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది.

ప్రెజర్:

ఒత్తిడిని జయించడంలో సౌత్ ఆఫ్రికా సమష్టిగా విఫలమైంది. బ్యాటింగ్ లో టాపార్డర్ కుప్పకూలిన తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు డిఫెన్స్ లో పడిపోయింది. రోహిత్ శర్మాలాగా అటాకింగ్ ఆడే ఆస్కారమే లేకుండా పోయింది. మరోవైపు బౌలింగ్ లో కూడా ఈ జట్టుకు ఒత్తిడి తప్పలేదు. ఎందుకంటే ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ చెలరేగారు. మొదటి వికెట్ తీసుకోవడానికి 60 పరుగుల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో కూడా పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయినట్లు అయింది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకుని ఉంటే కాస్త కాకపోతే కాస్త అయినా కూడా ఛాన్స్ ఉండేది. ఈ తప్పులతోనే సౌత్ ఆఫ్రికా జట్టు నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం పాలైంది.