iDreamPost
android-app
ios-app

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!

  • Published Aug 22, 2023 | 9:12 AM Updated Updated Aug 22, 2023 | 9:12 AM
  • Published Aug 22, 2023 | 9:12 AMUpdated Aug 22, 2023 | 9:12 AM
క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!

ఆసియా కప్‌ 2023 మరో వారంతో రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా టీమ్స​ పోరు జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 17 మందితో కూడిన స్కౌడ్‌ను కూడా ప్రకటించింది. ఈ టోర్నీ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ టోర్నీలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు కోసం​ అయితే యావత్‌ ప్రపంచ ఎదురుచూస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్‌-పాక్‌ పోరు ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దాయాది దేశాలు తలపడుతున్నాయంటే.. ఆసక్తి చూపని క్రికెట్‌ అభిమాని ఉండడు.

క్రికెట్‌ ప్రపంచంలో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే.. అది కేవలం మ్యాచ్‌ కాదు మినీ యుద్ధం. ఆటగాళ్లు కూడా అదే రేంజ్‌లో ఫీలై ఆడతారు. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో కేవలం అద్భుతమైన ఆటే కాదు.. అంతకు మించిన భావోద్వేగాలతో కూడి ఉంటు​ంది. అందుకే.. క్రికెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే అందరికీ అంతిష్టం. అయితే.. ఆసియా కప్‌ 2023 ముగిసిన తర్వాత కొన్ని వారాలకు ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి వరల్డ్‌ కప్‌ సంగ్రామం మొదలు కానుంది. ఆసియా కప్‌తో పాటు వరల్డ్‌ కప్‌ కోసం కూడా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఈగర్‌గా వేయిట్‌ చేస్తున్నారు.

పైగా ఈ సారి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు మన దేశంలోనే జరగనుండటంతో దేశం మొత్తం క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోనుంది. ఈ క్రమంలో ఆసియా కప్‌ 2023లో భాగంగా సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. అలాగే వరల్డ్‌ కప్‌లో సైతం ఈ దాయాదులు తలపడనున్నాయి. ఈ రెండు టోర్నీలకు భారత్‌-పాక్‌ మ్యాచ్‌లే హైలెట్‌ కానున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో పాటు.. క్రికెట్‌ అంటే అమితంగా ఇష్టపడే వారికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘హాట్‌ స్టార్‌’ శుభవార్త చెప్పింది. ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను ఫ్రీగా ప్రసారం చేయనుంది. గతంలో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ చూసేందుకు డబ్బులు పెట్టి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేకుండా.. హాట్‌ స్టార్‌ యాప్‌ మొబైల్‌ యూజర్లకు ఫ్రీగా లైవ్‌ ఇవ్వనుంది. అయితే.. ఇది కేవలం మొబైల్‌లో చూసేందుకే ఫ్రీ. టీవీల్లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. మరి హాట్‌ స్టార్‌ ఇచ్చిన ఈ బంపరాఫర్‌తో మరో సారి అందిర ఫోన్లలో హాట్‌ స్టార్‌ భారీ డౌన్‌లోడ్స్‌ అండ్‌ వ్యూస్‌తో దుమ్ములేపనుంది. మరి ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్ టీమ్‌లో దక్కని చోటు! సెటైరికల్‌ పోస్ట్‌తో ఇచ్చిపడేసిన చాహల్‌

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap