APLలో దుమ్ములేపుతున్న నెల్లూరు కుర్రోడు! అమ్మో మామూలు బ్యాటింగ్ కాదు!

Ashwin Hebbar, APL 2024: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ 2024లో వైజాగ్‌ వారియర్స్‌ తరఫున ఆడుతున్న ఓ కుర్రాడు ఇరగదీస్తున్నాడు. భారీ భారీ షాట్లతో దుమ్మురేపుతున్నాడు. నెల్లూరుకు చెందిన ఆ క్రికెటర్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Ashwin Hebbar, APL 2024: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ 2024లో వైజాగ్‌ వారియర్స్‌ తరఫున ఆడుతున్న ఓ కుర్రాడు ఇరగదీస్తున్నాడు. భారీ భారీ షాట్లతో దుమ్మురేపుతున్నాడు. నెల్లూరుకు చెందిన ఆ క్రికెటర్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ 2024లో మ్యాచ్‌లు హోరాహోరీ సాగి.. శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ అంతా సిద్ధమైంది. మొత్తం ఆరు జట్లు.. బెజవాడ టైగర్స్‌, రాయలసీమ కింగ్స్‌, కోస్టల్‌ రైడర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ ఈ టోర్నీలో పాల్గొన్ని. ప్రతి జట్టు లీగ్‌ దశలో ఐదేసి మ్యాచ్‌లు ఆడి.. తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ప్లే ఆఫ్స్‌​ దశను కూడా దాటి.. ఉత్తరాంధ్ర లయన్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ ఫైనల్‌కు చేరాయి. ఈ రెండు జట్లు శనివారం కప్పు కోసం పోటీ పడనున్నాయి.

అయితే.. వైజాగ్‌ వారియర్స్‌ జట్టులో ఉన్న ఓ కుర్రాడి గురించి మాట్లాడుకోవాలి. ఓపెనర్‌ అశ్విన్‌ హెబ్బర్‌. టోర్నీ మొత్తం చాలా అద్భుతంగా ఆడాడు. బెజవాడ టైగర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 27 బంతుల్లో 35, అలాగే రాయలసీమ కింగ్స్‌పై 46 బంతుల్లో 56, కోస్టల్‌ రైడర్స్‌ టీమ్‌పై 24 బంతుల్లో 31, ఉత్తరాంధ్ర లయన్స్‌తో మ్యాచ్‌లో 7 బంతుల్లో 20, గోదావరి టైటాన్స్‌పై 43 బంతుల్లో 75, కోస్టల్‌ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 51 బంతుల్లో 67, రాయలసీమ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 32లో 58 3 ఫోర్లు, 6 సిక్సులతో 81 పరుగులు చేసి.. వైజాగ్‌ వారియర్స్‌ టీమ్‌లో స్ట్రాంగ్‌ పిల్లర్‌లా మారిపోయాడు.

ఇంత అద్భుతంగా ఆడుతున్న ఈ కుర్రాడికి త్వరలోనే ఐపీఎల్‌లో కూడా అవకాశం వస్తుందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ కుర్రాడిది నెల్లూరు జిల్లా. పూర్తి పేరు కట్టింగేరి అశ్విన్ హెబ్బార్. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుని.. క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్న ఈ అశ్విన్‌.. ఏపీఎల్‌ 2024లో దుమ్ములేపాడు. దేశవాళి టోర్నీలో ఆంధ్ర తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ తీసుకున్నా.. ఆడే అవకాశం ఇవ్వలేదు. 29 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 999 పరుగులు, 48 లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 1554 పరుగులు చేశాడు. అలాగే ఫస్ట్‌ క్లాస్‌లో 5, లిస్ట్‌-ఏలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు. మరి త్వరలోనే ఈ అశ్విన్‌ హెబ్బర్‌ను ఐపీఎల్‌లో చూడాలని ఆంధ్ర క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇతని బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments