వీడియో: బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ ఆడిన మగాడ్ని ఎప్పుడైనా చూశారా?

Ashutosh Sharma, Jasprit Bumrah: ఐపీఎల్‌లో మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. గురువారం పంజాబ్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ కూడా చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో బుమ్రాను ఓ యువ క్రికెటర్‌ భయపెట్టాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Ashutosh Sharma, Jasprit Bumrah: ఐపీఎల్‌లో మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. గురువారం పంజాబ్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ కూడా చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో బుమ్రాను ఓ యువ క్రికెటర్‌ భయపెట్టాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

బుమ్రా గురించి తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడు. బుమ్రా బౌలింగ్‌ అంటే భయపడని బ్యాటర్‌ కూడా ఈ ప్రపంచంలో లేడంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. బుమ్రా అలాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌. ఏ పిచ్‌పైనైనా.. తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో బుల్లెట్‌ రైళ్లు పరిగెత్తించగల సత్తా ఉన్న బౌలర్‌. అతను సంధించే యార్కర్లు, బౌన్సర్లకు బ్యాటర్లు బెంబేలెత్తిపోవాల్సిందే. ప్రపంచంలో ఎంత పెద్ద బ్యాటర్‌ అయినా.. బుమ్రా బౌలింగ్‌కు వస్తే.. కాస్త ఒళ్లుదగ్గర పెట్టుకుని బ్యాటింగ్‌ చేయాల్సిందే. అది బుమ్రా రేంజ్‌. బిగబట్టి డెడ్లీ యార్కర్‌ వేశాడా? వికెట్లు బాంబుపెట్టి లేపిసినట్లు ఎగిరిపడతాయి. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బుమ్రా దెబ్బకు ఇంటర్నేషనల్‌ స్టార్‌ రిలీ రోసోవ్‌ వికెట్లు అలాగే టప్పున ఎగిరిపడ్డాయి. కానీ, ఓ కుర్రాడు మాత్రం.. బుమ్రాను అస్సలు లెక్కలేయకుండా, ఏ మాత్రం భయలేకుండా అదరగొట్టాడు. అతని పేరు అశుతోష్‌ శర్మ.

గురువారం ముల్లాన్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ చూసిన వారికి అశుతోష్‌ శర్మ కచ్చితంగా ఒక హీరోలా కనిపించి ఉంటాడు. ఎందుకంటే అతన అంత అద్భుతంగా ఆడాడు. పైగా బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ లాంటి బౌలర్‌ను ఎదుర్కొని.. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టులో గెలుపు ఆశలు చిగురింపజేసి.. 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులతో 61 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ 5వ బంతికి అశుతోష్‌ కొట్టిన సిక్స్‌ అయితే మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. బుమ్రా వేసిన యార్కర్‌ లెంత్‌ బాల్‌ను.. స్విప్‌షాట్‌తో ఫైన్‌లెగ్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌తో బుమ్రానే కాదు మొత్తం ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు షాక్‌ అయ్యారు. ఆ షాట్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు.. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ కొట్టాడంటే ఏ గుండెరా వాడిది అంటూ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 36, సూర్యకుమార్‌ యాదవ్‌ 78, తిలక్‌ వర్మ 34 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, సామ్‌ కరన్‌2, రబాడ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. ఆరంభంలో టపటపా వికెట్లు కోల్పోయింది. 14 పరుగులకే 4 వికెట్లు పడిపోవడంతో మ్యాచ్‌ చేజార్చుకుంది. కానీ, శశాంక్‌ 41, అశుతోష్‌ 61 పరుగులతో అదరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడి.. పంజాబ్‌లో ఆశలు చిగురించేలా చేశారు. కానీ, చివర్లో వాళ్లు అవుట్‌ కావడంతో పంజాబ్‌ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ముంబై బౌలర్లలో కోయోట్జీ, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో స్విప్‌ షాట్‌తో అశుతోష్‌ శర్మ సిక్స్‌ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments