SNP
Ashutosh Sharma, Jasprit Bumrah: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించినా.. హీరోగా నిలిచింది మాత్రం అశుతోష్ శర్మ. అయితే.. మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రాకు అశుతోష్ థ్యాంక్య్ చెప్పాడు. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Ashutosh Sharma, Jasprit Bumrah: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించినా.. హీరోగా నిలిచింది మాత్రం అశుతోష్ శర్మ. అయితే.. మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రాకు అశుతోష్ థ్యాంక్య్ చెప్పాడు. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా లాంటి స్టార్లు మంచి ప్రదర్శన చేయడం, పంజాబ్ చిత్తుగా ఓడిపోతుందనుకున్న టైమ్‌లో ఇద్దరు యువ క్రికెటర్లు అద్భుతంగా పోరాడి, ముంబైని భయపెట్టడంతో మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పైసా వసూలు మ్యాచ్‌లా సాగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన పంజాబ్ యువ క్రికెటర్ అశుతోష్ శర్మ హీరోగా నిలిచాడు. 193 పరుగుల టార్గెట్‌నే ఛేజ్ చేస్తున్న క్రమంలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన తర్వాత.. బ్యాటింగ్‌కు వచ్చిన అశుతోష్.. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతను చివరి వరకు ఉండి ఉంటే మ్యాచ్‌లో కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులతో 61 పరుగులు చేసి, ముంబై క్యాంప్‌ను భయపెట్టాడు అశుతోష్. అయితే.. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో అశుతోష్ కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ సిక్స్ గురించి మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. అశుతోష్ ఎమోషనల్ అయ్యాడు.
ఒక స్పీడ్ బౌలర్ బౌలింగ్‌లో స్విప్ షాట్‌తో సిక్స్ కొట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, కానీ, అది వరల్డ్స్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రా బౌలింగ్‌లో రావడం చాలా సంతోషంగా ఉందంటూ అశుతోష్ పేర్కొన్నాడు. ఇక విధంగా చెప్పాలంటే తన కల తీర్చుకోవడానికి సహాయపడిన బుమ్రాకు అశుతోష్ థ్యాంక్స్ చెప్పాడనే చెప్పాలి. ఇక బుమ్రా ఎంత గొప్ప బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని హేమాహేమీ బ్యాటర్లకు కూడా బుమ్రా బౌలింగ్‌లో ఆడాలంటే భయడుతుంటారు. అలాంటి బుమ్రా బౌలింగ్‌తో తొలి సారి ఐపీఎల్ ఆడుతున్న కుర్రాడు.. యార్కర్ లెంత్ బాల్‌ను మొకాళ్లపై కూర్చోని ఫైన్‌లెగ్ మీదుగా భారీ సిక్స్‌కొట్టాడు. ఆ షాట్ చూసి.. బుమ్రానే కాదు మొత్తం ముంబై ఇండియన్స్ టీమ్ సైతం ఉలిక్కి పడింది. ఇదేంటి బుమ్రా బౌలింగ్‌లోనే ఇలా కొట్టాడు అని. ఆ సూపర్ షాట్ కొట్టిన తర్వాత అశుతోష్ చిరునవ్వులు చిందించాడు. మ్యాచ్ ముగిశాక.. బుమ్రా సైతం అశుతోష్‌ను అభినందించడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి తర్వాతగానే అవుటైనా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేసి రాణించాడు. ఇషాన్ అవుటైన తర్వాత రోహిత్‌కు జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ అవుట్ అయ్యాక.. తిలక్ వర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి రాణించాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్2, రబాడ ఒక వికెట్ పడగొట్టారు. ఇక 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్.. ఆరంభంలో టపటపా వికెట్లు కోల్పోయింది. కానీ, శశాంక్ 41, అశుతోష్ 61 పరుగులతో అదరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడి.. పంజాబ్‌లో ఆశలు చిగురించేలా చేశారు. కానీ, చివర్లో వాళ్లు అవుట్ కావడంతో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మరి ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌తో అశుతోష్ కొట్టిన సిక్స్‌తో పాటు మ్యాచ్ ముగిశాక అతను చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not everyone is capable of hitting a sweep six to Jasprit Bumrah
Ashutosh Sharma is a Superstar 💥#PBKSvMI #PBKSvsMI pic.twitter.com/0Cg4AHwuWe
— Richard Kettleborough (@RichKettle07) April 18, 2024
Ashutosh Sharma said, “I had a dream to hit a six against a fast bowler by sweeping, it came against the world’s best bowler Bumrah, so I’m overjoyed”. pic.twitter.com/ZedXyDKl84
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024