ఆ మాజీ క్రికెటర్‌ నో చెప్పడంతో.. కోచ్‌గా మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఓటమి తర్వాత.. టీమిండియాలో చాలా మార్పులు జరగుతాయని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఫైనల్లో ఓడినా.. టీమిండియా ప్రదర్శనపై అంతా సంతృప్తిగా ఉన్నారు. అయితే ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. కొత్త కోచ్‌ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఆ క్రమంలోనే..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఓటమి తర్వాత.. టీమిండియాలో చాలా మార్పులు జరగుతాయని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఫైనల్లో ఓడినా.. టీమిండియా ప్రదర్శనపై అంతా సంతృప్తిగా ఉన్నారు. అయితే ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. కొత్త కోచ్‌ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఆ క్రమంలోనే..

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ సక్సెస్‌ఫుల్‌ అనే చెప్పాలి. టీ20 వరల్డ్‌ కప్‌ 2022, వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లాంటి మెగా టోర్నీల్లో టీమిండియా కప్పు గెలవకపోయినా.. కోచ్‌గా ద్రవిడ్‌ పనితీరు మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కానీ, ఫైనల్లో ఓటమితో కప్పు చేజారిపోయింది. ఈ ఓటమితో రాహుల్‌ ద్రవిడ్‌పై ఎవరికీ ఎలాంటి కంప్లైట్స్‌ లేవు. కానీ, హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలం వరల్డ్‌ కప్‌తో ముగియడంతో.. తర్వాతి హెడ్‌ కోచ్‌ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. పైగా మరో ఆరు నెలల్లోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ముంచుకొస్తుండటంతో.. హెడ్‌ కోచ్‌ను నియమించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది.

వరల్డ్‌ కప్‌ గెలిచి ఉంటే.. కచ్చితంగా ద్రవిడ్‌ను మళ్లీ హెడ్‌ కోచ్‌గా నియమించే వారు. కానీ, ఫలితం వేరేలా మారడంతో.. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం కొత్త కోచ్‌ను వెతికే పనిలో పడింది బీసీసీఐ. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌, స్టార్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాను భారత టీ20 జట్టుకు కోచ్‌గా పనిచేయాలని కోరింది. కానీ, నెహ్రా అందుకు ఒప్పుకోలేదన సమాచారం. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కోచ్‌గా ఉన్న ఆశిష్‌ నెహ్రా.. ఆ జట్టును అద్భుతంగా నడిపించాడు. 2022లో ఆడిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ఐపీఎల్‌ 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఇలా కోచ్‌గా నెహ్రా ట్రాక్‌ రికార్డ్‌ అద్భుతంగా ఆడటంతో టీమిండియాకు సైతం అతన్నే కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది.

కానీ, కారణం ఏంటో తెలియదు కానీ, భారత టీ20 జట్టుకు కోచ్‌గా ఉండేందుకు మాత్రం నెహ్రా నో చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో.. మరోదారి లేక ప్రస్తుతం ఉన్న జట్టుతో మంచి బాండింగ్‌ ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌నే మరో ఏడాది పాటు కొనసాగించాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై ద్రవిడ్‌తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 వరకు హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే.. తాజాగా ద్రవిడ్‌ సైతం తన పదవీ కాలం పొడగింపుకు అంగీకరం తెలిపాడు. అతనితో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ మొత్తం టీ20 వరల్డ్‌ కప్‌ వరకు కొనసాగనుంది. అయితే.. వరల్డ్‌ కప్‌ పోయినా కూడా.. టీమిండియా మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎవరుంటే బాగుంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments