iDreamPost
android-app
ios-app

వాళ్లిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప.. ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

  • Author Soma Sekhar Published - 05:48 PM, Fri - 24 November 23

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్టార్ బౌలర్, మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా. వారిద్దరూ వారంతట వారే రిటైర్మెంట్ ప్రకటించాలి, కానీ.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్టార్ బౌలర్, మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా. వారిద్దరూ వారంతట వారే రిటైర్మెంట్ ప్రకటించాలి, కానీ.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 05:48 PM, Fri - 24 November 23
వాళ్లిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప.. ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రతీ ఒక్క భారతీయుడిని కలచివేసింది. ఈ ఓటమి బాధ నుంచి బయటపడేందుకు భారత జట్టుకు ఇప్పుడు ఓ విజయం కావాలి. అలాంటి విజయాన్నే అందించారు టీమిండియా యువ ప్లేయర్లు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేశారు. దీంతో ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇదిలా ఉంటే.. టీ20 మ్యాచ్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్టార్ బౌలర్, మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా. వారిద్దరూ వారంతట వారే రిటైర్మెంట్ ప్రకటించాలి తప్ప.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో.. ఎన్నో ప్రశ్నలు బయలుదేరాయి. అందులో ప్రధానమైనవి.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీలు టీ20 కెరీర్ కు వీడ్కోలు పలుకుతారా? వీరిద్దరి టీ20 కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దానికి కారణం లేకపోలేదు. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్, విరాట్ లు టీమిండియా తరఫున ఒక్క పొట్టి క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ మాత్రం ఆడారు. దీంతో వీరిద్దరూ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతారనే ఊహాగానలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో విరాట్, రోహిత్ టీ20 భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా నెహ్రా ఈ కామెంట్స్ చేశాడు.

నెహ్రా మాట్లాడుతూ..” విరాట్ కోహ్లీ ఒకే క్యాలెండర్ ఇయర్ లో దాదాపు 1000 పరుగులు చేస్తున్నాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే ఏ సెలక్టర్ అయినా వాళ్లను ఎంపిక చేయకుండా ఉంటాడా? ఈ ద్వయం టీ20ల్లో కొనసాగుతారో? లేదో? తెలీదు కానీ.. విశ్రాంతిని మాత్రం కోరుకుంటున్నారు. రోహిత్, విరాట్ లు తమకు తాముగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. తప్ప వాళ్లు జట్టుకు దూరమైయ్యే పరిస్థితి కనిపించడం లేదు” అంటూ నెహ్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 36 ఏళ్ల రోహిత్, 35 సంవత్సరాల కోహ్లీలు ఇంకొన్ని సంవత్సరాలు టీ20ల్లో కొనసాగే సత్తా ఉన్నవారేనని నెహ్రా చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా వస్తున్న ఈ వార్తలపై డైరెక్ట్ గా ఇటు రోహిత్ అటు విరాట్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నెహ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.