iDreamPost
android-app
ios-app

హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడానికి గంభీరే కారణం: భారత మాజీ క్రికెటర్‌

  • Published Jul 24, 2024 | 7:12 PMUpdated Jul 24, 2024 | 7:12 PM

Hardik Pandya, Gautam Gambhir, BCCI: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా టీ20 కెప్టెన్‌ కాలేకపోవడానికి కారణం గంభీరే అంటూ ఓ భారత మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Gautam Gambhir, BCCI: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా టీ20 కెప్టెన్‌ కాలేకపోవడానికి కారణం గంభీరే అంటూ ఓ భారత మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 24, 2024 | 7:12 PMUpdated Jul 24, 2024 | 7:12 PM
హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడానికి గంభీరే కారణం: భారత మాజీ క్రికెటర్‌

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. టీమిండియాలో భారీ మార్పులు జరిగాయి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం. భారత హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ రాక, టీ20 కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ నియామకం, టీ20 వైస్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాను తప్పించి శుబ్‌మన్‌ గిల్‌ను నియమించడం, అలాగే వన్డేల్లో కూడా అతన్నే వైస్‌ కెప్టెన్‌ చేసింది బీసీసీఐ. ఇన్ని మార్పుల తర్వాత.. శ్రీలంకతో సిరీస్‌ ఆడేందుకు రెడీ అయింది. అయతే.. రోహిత్‌ శర్మ తర్వాత.. టీ20 కెప్టెన్సీ హార్ధిక్‌ పాండ్యాకు దక్కతుందని అంతా భావించారు.

కానీ, అందరికీ షాకిస్తూ.. సూర్యకుమార్‌ యాదవ్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. పైగా వైస్‌ కెప్టెన్సీ పోస్ట్‌ నుంచి హార్ధిక్‌ పాండ్యాను తప్పించి గిల​్‌ను వైస్‌ కెప్టెన్‌ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాను తప్పించి.. గిల్‌కు ఎలా వైస్‌ కెప్టెన్సీ ఇస్తారంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే.. టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కారణంగానే హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ దక్కకుండా పోయిందంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా ఆరోపించాడు.

ఆశిష్‌ నెహ్రా మాట్లాడుతూ.. ‘క్రికెట్‌లో ఇది సహజమని.. జట్టుకు కొత్త కోచ్‌ వచ్చిన సమయంలో అతనికి ఒక ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం మార్పులు జరగడం అనేది సహజం. అలాగే జట్టు కెప్టెన్‌ను కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయని, అవి రెండు కలవని సమయంలో మార్పులు జరుగుతుంటాయని, ఇప్పుడు టీమిండియా పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడానికి కారణం అదే అయి ఉంటుంది’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా కొత్త హెడ్‌ కెచ్‌గా వచ్చిన గంభీర్‌ గురించి నెహ్రా కామెంట్‌ చేశాడు. కాగా, గుజరాత్‌ టైటాన్స్‌కు ఆశిష్‌ నెహ్రా కోచ్‌గా, హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్‌గా ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో ఉన్న విషయం తెలిసందే. వారిద్దరి కాంబినేషన్‌లో గుజరాత్‌ ఐపీఎల్‌ 2022లో ఛాంపియన్‌గా అవతరించింది. అలాగే ఐపీఎల్‌ 2023లో ఫైనల్‌ వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచింది. మరి నెహ్రా పాండ్యా కెప్టెన్సీ విషయమై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి