iDreamPost

ఆస్ట్రేలియా బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న మార్క్ వుడ్!

  • Author singhj Updated - 06:14 PM, Thu - 6 July 23
  • Author singhj Updated - 06:14 PM, Thu - 6 July 23
ఆస్ట్రేలియా బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న మార్క్ వుడ్!

క్రికెట్ లవర్స్​కు యాషెస్ సిరీస్ అసలైన మజా పంచుతోంది. బూడిద కప్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు హోరాహోరీగా తలపడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్​ నెగ్గినప్పటికీ, ఇంగ్లండ్ ఆడిన తీరును మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. ఎలాగైనా రిజల్ట్ రాబట్టాలని ఫస్ట్ డే నుంచి ఇంగ్లీష్ టీమ్ బజ్​బాల్ గేమ్​తో అదరగొట్టింది. అయితే కమిన్స్ సేన అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్​కు పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో యాషెస్ మూడో టెస్ట్ కీలకంగా మారింది. ఇందులోనూ ఓడితే ఇంగ్లండ్ పని అయిపోనట్లే. అందుకే ఎలాగైనా గెలిచి తీరాలని ఇంగ్లీష్ టీమ్ బరిలోకి దిగింది. ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టుకు ఇంగ్లండ్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు.

పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ సూపర్బ్ బౌలింగ్​తో తలో వికెట్​ తీశారు. తద్వారా కీలకమైన టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా మార్క్ వుడ్ తన పేస్​తో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించాడు. వుడ్ వేసే బంతులకు ఆస్ట్రేలియా బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. అతడు వేసిన ఒక బాల్​కు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అయితే కళ్లుతేలేశాడు. 37 బంతుల్లో 13 రన్స్​తో ఆడుతున్న ఖవాజాను ఒక అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ట్ చేశాడీ స్పీడ్​స్టర్. వుడ్ 152 కిలోమీటర్ల వేగంతో వేసిన ఆ బాల్​ను ఆడటంలో ఖవాజా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, అద్భుతమైన పేస్, నియంత్రణతో కూడిన బౌలింగ్​తో ఆసీస్​ను వణికించాడు మార్క్ వుడ్. అతడి పేస్​ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆసీస్ బ్యాట్స్​మెన్ కంగారు పడ్డారు. వుడ్ ఓవర్​లో రన్స్ తీసేందుకు ఆపసోపాలు పడ్డారు. వుడ్ తన తొలి 4 ఓవర్లలో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చి ఖవాజా వికెట్ తీశాడు. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ప్రతాపం ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన మార్క్ వుడ్.. మొత్తంగా 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అందులో 3 మెయిడెన్లు ఉండటం విశేషం. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 91 రన్స్​తో ఉంది. ట్రావిస్ హెడ్ (10 నాటౌట్), మిచెల్ మార్ష్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి