కోహ్లీ, ధోని కాదు.. వరల్డ్​లో రిచెస్ట్ క్రికెటర్ ఈ భారత యంగ్ ప్లేయరే! ఎవరీ ఆర్యమన్?

Virat Kohli, MS Dhoni, Aryaman Birla: రిచెస్ట్ క్రికెటర్ ఎవరు అనగానే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనే చాలా మంది అనుకుంటారు. కోహ్లీ లేదా ధోనీల్లో ఎవరో ఒకరు టాప్​లో ఉన్నారని భావిస్తారు. కానీ వీళ్లు కాదు.. ఓ భారత యంగ్ ప్లేయరే సంపన్న క్రికెటర్​గా ఉన్నాడు.

Virat Kohli, MS Dhoni, Aryaman Birla: రిచెస్ట్ క్రికెటర్ ఎవరు అనగానే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనే చాలా మంది అనుకుంటారు. కోహ్లీ లేదా ధోనీల్లో ఎవరో ఒకరు టాప్​లో ఉన్నారని భావిస్తారు. కానీ వీళ్లు కాదు.. ఓ భారత యంగ్ ప్లేయరే సంపన్న క్రికెటర్​గా ఉన్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్​కు ఆడటంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడుతూ భారీగా వెనకేసుకుంటున్నాడు కింగ్. వీటి కంటే యాడ్ రెవెన్యూ ద్వారా భారీగా కూటబెట్టుకుంటున్నాడు. బిజినెస్​లో కూడా దిగిన ఈ స్టార్ క్రికెటర్.. క్లోతింగ్ స్టోర్స్​తో పాటు రెస్టారెంట్స్ కూడా నడిపిస్తూ తన ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నాడు. సంపదలో కోహ్లీతో పాటు టీమిండియా లెజెండ్స్ మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ కూడా పరుగులు తీస్తున్నారు. వీళ్ల రేంజ్​లో సంపాదిస్తున్న క్రికెటర్స్ ఎవరూ లేరు. కోహ్లీ అయితే సంపదలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయినా వీళ్లెవరూ రిచెస్ట్ క్రికెటర్ లిస్ట్​లో టాప్​లో లేరు. ఆదాయంలో కోహ్లీ, ధోనీని మించి వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్​గా కొనసాగుతున్నాడో భారత యంగ్ ప్లేయర్. అతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్​గా కొనసాగుతున్నాడు ఆర్యమన్ బిర్లా. కోహ్లీ, ధోని కంటే అత్యధిక ఆదాయం కలిగిన ప్లేయర్​గా, వరల్డ్​లోనే రిచెస్ట్ క్రికెటర్​గా ఆర్యమన్​ను చెప్పొచ్చు. దేశంలోని అపర కుబేరుల్లో ఒకరైన వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కొడుకే ఆర్యమన్ బిర్లా. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే క్రికెట్​లోనూ అతడు రాణించాడు. 2017 క్రికెట్​లోకి డెబ్యూ ఇచ్చిన ఈ యంగ్ ప్లేయర్.. మధ్యప్రదేశ్​ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్​ ఆడాడు. అయితే ఆ తర్వాత రెండేళ్లకు అనూహ్యంగా గేమ్​కు గుడ్​బై చెప్పేశాడు. ఇక, ఆస్తి విషయానికొస్తే.. అతడి నెట్​వర్త్ రూ.70 వేల కోట్లకు పైనే ఉండటం విశేషం. కోహ్లీ ఆస్తి రూ.1,050 కోట్లు అని తెలుస్తోంది. విరాట్, ధోని, సచిన్.. ఈ ముగ్గురి ఆస్తి కలిపినా ఆర్యమన్ సంపదకు దగ్గర్లో కూడా లేదు.

కాగా, 22 ఏళ్ల వయసులో క్రికెట్​ నుంచి తప్పుకున్నాడు ఆర్యమన్ బిర్లా. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా అతడు క్రికెట్​ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్​ల్లో కలిపి అతడు 414 పరుగులు చేశాడు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్​గా ఉన్న ఆర్యమన్.. జెంటిల్మన్ గేమ్​కు గుడ్​బై చెప్పిన త్వాత బిజినెస్​ సైడ్ ఫోకస్ చేశాడు. 70,000 కోట్ల ఆస్తులు కలిగిన అతడికి ఖరీదైన కార్లు, వాచీలు లాంటివి కూడా ఉన్నాయట. ఇది తెలిసిన నెటిజన్స్.. ఇన్నాళ్లూ రిచెస్ట్ క్రికెటర్ అంటే కోహ్లీ, ధోని అని అనుకున్నామని, కానీ ఇతడని తెలియదని అంటున్నారు. బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి ఆ రేంజ్​లో ఉన్నాడని.. గానీ క్రికెటర్ ఈ రేంజ్​లో సంపాదించడం కుదరదని చెబుతున్నారు.

Show comments