Somesekhar
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ రేర్ ఫీట్ ను సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే..
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ రేర్ ఫీట్ ను సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎప్పటిలాగే తక్కువ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఆచితూచి ఆడుతూ టార్గెట్ ను ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో యూఎస్ఏ బ్యాటర్లను తన పదునైన పేస్ బౌలింగ్ తో ఓ ఆటాడుకున్నాడు అర్షదీప్ సింగ్. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి పసికూనను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక ఈ మ్యాచ్ లో 4 వికెట్లతో సత్తాచాటిన ఈ పేసర్.. తన పేరిట ఓ రేర్ ఫీట్ ను లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి ఇండియన్ బౌలర్ గా కూడా నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి ఓవర్ నుంచే అమెరికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తన పదునైన పేస్ తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు నేల కూల్చాడు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ రికార్డును నమోదు చేశాడు అర్షదీప్.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా బౌలర్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అతడు 2014 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టాడు అర్షదీప్. దీంతో పాటుగా మరో రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో తొలి ఓవర్లో తొలి బంతికి వికెట్ తీసిన మెుదటి ఇండియన్ బౌలర్ గా అర్షదీప్ ఘనత వహించాడు. ఇంతకు ముందు 2022 టీ20 వరల్డ్ కప్ లో బాబర్ అజామ్ ను సైతం తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్(50*), శివమ్ దూబే(31*) పరుగులతో రాణించాడు. మరి పసికూన బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ రికార్డులు క్రియేట్ చేసిన అర్షదీప్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
HISTORY IN NEW YORK…!!!
– ARSHDEEP SINGH registered the best bowling figures by Indian Men’s bowler in T20I World Cup 🤯👌 pic.twitter.com/zMapia8sTx
— Johns. (@CricCrazyJohns) June 12, 2024
4️⃣ wickets
1️⃣7️⃣ dots
9️⃣ runs
2️⃣.2️⃣0️⃣ economyArshdeep Singh delivers the best ever spell by an India in T20 World Cup pic.twitter.com/EFMv7LUQDS
— CricTracker (@Cricketracker) June 12, 2024