iDreamPost
android-app
ios-app

అశ్విన్ విషయంలో మాట మార్చిన ద్రవిడ్! అడ్డంగా దొరికేసి..!

  • Published Sep 25, 2023 | 1:48 PM Updated Updated Sep 25, 2023 | 1:48 PM
  • Published Sep 25, 2023 | 1:48 PMUpdated Sep 25, 2023 | 1:48 PM
అశ్విన్ విషయంలో మాట మార్చిన ద్రవిడ్! అడ్డంగా దొరికేసి..!

రవిచంద్రన్‌ అశ్విన్‌ విషయంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట మార్చాడు. ఎస్‌.. ఒక్క మ్యాచ్‌తో అశ్విన్‌ తమ వరల్డ్‌ కప్‌ ప్లాన్స్‌లో ఉన్నాడంటూ ద్రవిడ్‌ యూటర్న్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 7 ఓవర్లు వేసిన అశ్విన్‌ 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన తర్వాత.. ద్రవిడ్‌ మాట్లాడుతూ.. అశ్విన్‌ తమ వరల్డ్‌ కప్‌ ప్లాన్స్‌లో ఎప్పటి నుంచో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. అయితే.. ద్రవిడ్‌ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌పై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో అశ్విన్‌ కూడా ఉంటే.. దాదాపు ఏడాది కాలంగా అతన్ని వన్డే క్రికెట్‌కు ఎందుకు దూరంగా పెట్టారని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఈ వన్డే వరల్డ్‌ కప్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయలేదు. వరల్డ్‌​ కప్‌ కోపం ప్రకటించిన 15 మంది స్క్వౌడ్‌లో అశ్విన్‌కు చోటు దక్కలేదు. కానీ, వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయపడటం, బౌలింగ్‌లో ప్రభావం చూపించలేకపోతుండటంతో అనూహ్యంగా అశ్విన్‌ పేరు తెరపైకి తెచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. వరల్డ్‌ కప్‌కు ముందు జరుగుతున్న ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేసింది. అక్షర్‌ గాయంతో వరల్డ్‌ కప్‌కు ఫిట్‌గా లేకపోతే.. అతని స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌, అశ్విన్‌లలో ఒకరిని తీసుకోవాలనేది ద్రవిడ్‌ ప్లాన్‌. కానీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సీనియరిటీ కమ్‌ ఆఫ్‌స్పిన్నర్‌ కోసం అశ్విన్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపుతుండటంతో.. ద్రవిడ్‌ సైతం అశ్విన్‌పై ఫోకస్‌ పెట్టాడు.

ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు అశ్విన్‌ను ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇవ్వాల్సిందిగా ద్రవిడ్‌ కోరినట్లు సమాచారం. దానికి అశ్విన్‌ రియాక్ట్‌ అవుతూ.. అసలు నాకేమైందని నేను ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇవ్వాలి. గాయమై జట్టుకు దూరం అయ్యానా? అంటూ ద్రవిడ్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తుంది. దీంతో చేసేందేం లేక అశ్విన్‌ను తొలి వన్డేలో ఆడించారు. తొలి వన్డేలో ఒక వికెట్‌ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసిన అశ్విన్‌ రెండో వన్డేలో మరింత అద్భుతంగా బౌలింగ్‌ వేసి.. 3 వికెట్ల తీయడంతో పాటు మిగతా బౌలర్లందరికంటే కూడా తక్కువ ఎకానమీతో రాణించాడు. దీంతో.. అశ్విన్‌ ప్రదర్శన బాగా చేయడంతో అతన్ని వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకునే క్రమంలో.. అతను ఎప్పటి నుంచో తమ వరల్డ్‌ కప్‌ టీమ్‌ ప్లాన్స్‌లో ఉన్నట్లు ద్రవిడ్‌ మాట మారుస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఇండోర్‌ నుంచి ఔట్‌డోర్‌కు! KL రాహుల్‌ కొడితే ఇలా ఉంటుంది