SNP
Rohit Sharma, T20 World Cup 2024, Virat Kohli, Sourav Ganguly: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు.. కానీ, ఈ విజయం కోసం ఎన్నో శాపాలు పొందిన ఆ వ్యక్తి మాత్రం ఇప్పుడు ఎవరికీ గుర్తులేడు. అతను ఎవరో? టీమిండియా కోసం ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Rohit Sharma, T20 World Cup 2024, Virat Kohli, Sourav Ganguly: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు.. కానీ, ఈ విజయం కోసం ఎన్నో శాపాలు పొందిన ఆ వ్యక్తి మాత్రం ఇప్పుడు ఎవరికీ గుర్తులేడు. అతను ఎవరో? టీమిండియా కోసం ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల కలను నిజం చేస్తూ.. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి బాధకు కసి తీర్చుకుంటూ.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించింది. శనివారం బార్బోడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నమ్మశక్యం కాని రితీలో గెలిచి.. విశ్వవిజేతగా అవతరించింది. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా ధోని కెప్టెన్సీలో నెగ్గింది. మళ్లీ ఇన్నేళ్లు అంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మపై, ఫైనల్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, అలాగే బుమ్రా, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్‌లపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ, అసలు ఈ విజయం వెనుక.. ఎన్నో తిట్లు, శాపాలను భరించి.. భారత జట్టుకు మేలు చేసిన ఓ అశ్వత్థామ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ అశ్వత్థామ ఎవరు? ఇప్పుడు టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడం కోసం అతను ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని అవమానాలు భరించాడో తెలుసుకుందాం..
సౌరవ్ గంగూలీ.. చాలా మందికి టీమిండియా మాజీ కెప్టెన్‌గా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగానే తెలుసు. కానీ, ఆటగాడిగా సచిన్‌కు పోటీ ఇచ్చి, ఒకానొక సమయంలో సచిన్‌ను డామినేట్ చేశాడు.. కెప్టెన్‌గా టీమిండియా తలరాతనే మార్చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడి డొమెస్టిక్ క్రికెట్‌ను గతి మార్చాడు.. దాంతో పాటే టీమిండియా భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇలా అనుక్షణం.. ఏ హోదాలో ఉన్నా.. టీమిండియా ఎదుగుదల, భవిష్యత్తు కోసమే పరితపించి పోయాడు. అలా బీసీసీఐ అధ్యక్షుడిగా అతను తీసుకున్న కీలక నిర్ణయమే నేడు టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించింది. ఆ నిర్ణయం ఏంటంటే.. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడం. రోహిత్‌లోని గొప్ప నాయకత్వ లక్షణాలను గుర్తించిన దాదా.. రోహిత్‌ను టీమిండియా సారథిగా నియమించాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు కప్పు రూపంలో ఫలితం ఇచ్చింది.
అయితే.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని గంగూలీ కావాలనే తప్పించాడని చాలా విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లీ సైతం విషయంపై బహిరంగంగా బీసీసీఐపై విమర్శలు చేశాడు. తన విరాట్ కోహ్లీ అభిమానులు, మరికొంత మంది క్రికెట్ ఫ్యాన్స్.. గంగూలీపై తీవ్ర విమర్శలకు దిగారు. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా.. సోషల్ మీడియా వేదికగా దారుణమైన తిట్లుతో విరుచుకుపడ్డాడు. కోహ్లీ అభిమానులు ఒక ఏడాది పాటు దాదాను ట్రోల్ చేశాడు. ఐపీఎల్ సందర్బంగా కోహ్లీ సైతం దాదా ముందు నుంచి వెళ్తుంటే కాలు మీద కాలేసుకుని అలాగే కూర్చోని అవమానించాడు. అవన్ని మౌనంగా భరించిన గంగూలీ టీమిండియా భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించాడు. కోహ్లీని తాను కెప్టెన్సీ నుంచి తీసేయలేదని చెప్పినా.. వినకుండా దాదాపై కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో పచ్చిబూతులు తిట్టారు. కానీ, ఆ నాడు కోహ్లీ స్థానంలో రోహిత్‌ను కెప్టెన్ చేయాలని గంగూలీ తీసుకున్న నిర్ణయమే ఈనాడు.. టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు దోహద పడింది. 2023లో వన్డే వరల్డ్ కప్ కొద్దిలో మిస్ అయింది కానీ.. లేదంటే దాదా నిర్ణయానికి మరో లెక్క ఉండేది. మరి టీమిండియా కప్పులు గెలిచేందుకు గంగూలీ తీసుకున్న నిర్ణయాలు, అందుకు ఫలితంగా అతను పొందిన అవమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma never wanted India’s captaincy it was sourav ganguly who convinced him to Lead India.
One of the best decisions by Sourav and he bodied all those who said Rohit Sharma was running an agenda against Virat Kohli. pic.twitter.com/MWS0K2ArY3
— Ansh Shah (@asmemesss) November 10, 2023