SNP
Anshul Kamboj, SRH vs MI, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బౌలర్ ఆకట్టుకున్నాడు. అంతా అతన్ని ఏకే47 అంటున్నారు. మరి ఆ ఏకే47 గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
Anshul Kamboj, SRH vs MI, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బౌలర్ ఆకట్టుకున్నాడు. అంతా అతన్ని ఏకే47 అంటున్నారు. మరి ఆ ఏకే47 గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువ బౌలర్ అందర్ని ఆకట్టుకున్నాడు. అతని పేరు అన్షుల్ కాంబోజ్. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. తన తొలి ఓవర్‌తోనే.. ఇతనిలో ఏదో విషయం అనిపించాడు. ఈ సీజన్‌లో బౌలర్లందరినీ తన బ్యాటింగ్‌తో భయపెట్టిన ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు అన్షుల్. ఈ కుర్రాడి జెర్సీ నంబర్ కూడా ఆసక్తికరంగా ఉంది. 47 నంబర్, ఏకే పేరుతో.. ఏకే 47 బౌలర్‌గా తొలి మ్యాచ్‌లోనే గుర్తింపు పొందాడు. అయితే.. తొలి మ్యాచ్ ఆడుతూ.. ట్రావిస్ హెడ్ లాంటి బ్యాటర్‌నే వణికించాడు ఎవరీ బౌలర్ అంటూ క్రికెట అభిమానులు తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ హర్యానాకు చెందిన క్రికెటర్. 2000 డిసెంబర్ 6న జన్మించాడు. రైట్ హ్యాండ్ మీడియం బౌలర్, అలాగే రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్. దేశవాళి క్రికెట్‌లో హర్యానా స్టేట్ టీమ్ తరఫున ఆడుతుంటాడు. దేశవాళి క్రికెట్‌లో ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా.. మంచి ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ 2024 కోసం.. గతేడాది చివర్లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇతన్ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. 2020 ఫిబ్రవరిలో దేశవాళి క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఏకే 284 పరుగులు చేశాడు, అలాగే 24 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు సాధించాడు. ఇలా మంచి డెమెస్టిక్ కెరీర్ ఉండటంతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్షుల్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఐదో బంతికి ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, అది నో బాల్ కావడంతో తన తొలి ఐపీఎల్ వికెట్‌ను పొందలేకపోయాడు అన్షుల్. ఆ తర్వాత ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బాల్‌కు కూడా ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసినంత పనిచేశాడు అన్షుల్. ఆ బాల్‌కు ట్రావిస్ హెడ్ భారీ షాట్ ఆడాడు. కానీ, బౌండరీ లైన్ వద్ద నువాన్ తుషార్ క్యాచ్ వదిలేయడంతో మరోసారి హెడ్‌ను అవుట్ చేసే ఛాన్స్ మిస్ అయింది. కానీ, అదే ఓవర్ 4వ బంతికి మయాంక్ అగర్వాల్ లాంటి స్టార్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి.. తన డెబ్యూ మ్యాచ్‌లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. కానీ, ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా రెండు సార్లు దాదాపు అవుట్ చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు ఒక సారి నో బాల్, మరోసారి క్యాచ్ డ్రాప్ అయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అన్షుల్ కాంబోజ్ 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. తొలి మ్యాచ్‌లో కాస్త ఎక్స్‌పెన్సీవ్‌గా అనిపించినా.. భవిష్యత్తులో మంచి బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు సైతం భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The wait is over for the 23-year-old Anshul Kamboj 🙌
📸: Jio Cinema pic.twitter.com/LwYK6DWbH5
— CricTracker (@Cricketracker) May 6, 2024