Aamer Jamal: 32 ఏళ్ల తరువాత పాక్ జట్టులో మరో ఇమ్రాన్ ఖాన్! ఆస్ట్రేలియానే వణికించాడు

32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాక్ టీమ్ లోకి మరో ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు. అతడి పేరే 'అమిర్ జమాల్'. ఆస్ట్రేలియాని వారి గడ్డపైనే వణికించాడు. మరి ఈ జూనియర్ ఇమ్రాన్ ఖాన్ గురించి తెలుసుకుందాం పదండి.

32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాక్ టీమ్ లోకి మరో ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు. అతడి పేరే 'అమిర్ జమాల్'. ఆస్ట్రేలియాని వారి గడ్డపైనే వణికించాడు. మరి ఈ జూనియర్ ఇమ్రాన్ ఖాన్ గురించి తెలుసుకుందాం పదండి.

సాధారణంగా క్రికెట్ లో దశాబ్దానికి ఒక క్రికెటర్ వెలుగులోకి వస్తూ ఉంటాడు. తన బ్యాటింగ్ తో, బౌలింగ్ తో వరల్డ్ క్రికెట్ ను ఏక ఛత్రాధిపత్యం కింద ఏలుతూ ఉంటాడు. అలాంటి ప్లేయర్లు ప్రపంచ క్రికెట్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన రకమే పాకిస్తాన్ దిగ్గజ ఆల్ రౌండర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 32 ఏళ్ల క్రితం క్రికెట్ లో ఈ పేరు ఓ సంచలనం. తన బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారేవాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ 1992 వరల్డ్ కప్ విన్నింగ్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ అలాంటి నికార్సైన ఆల్ రౌండర్ పాక్ జట్టుకు దొరకలేదనే చెప్పాలి. కాగా.. 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాక్ టీమ్ లోకి మరో ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు. అతడి పేరే ‘అమిర్ జమాల్’. ఆస్ట్రేలియాని వారి గడ్డపైనే వణికించాడు. మరి ఈ జూనియర్ ఇమ్రాన్ ఖాన్ గురించి తెలుసుకుందాం పదండి.

అమిర్ జమాల్.. పాకిస్తాన్ లోని మియాన్ వాలీ, పంజాబ్ ప్రాంతంలో 1996 జులై 5న జన్మించాడు. 2013 నుంచే తన డొమెస్టిక్ క్రికెట్ ను ఆడటం ప్రారంభించాడు. అండర్ 19 లోనే క్లబ్ క్రికెట్ తో పాటుగా ఇంగ్లాండ్ లో లీగ్ క్రికెట్ ఆడేవాడు జమాల్. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన జమాల్, బ్యాటింగ్ పై కూడా దృష్టిపెట్టి చిన్నతనం నుంచే ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే పాకిస్తాన్ కు తిరిగి వచ్చిన తర్వాత తగిన అవకాశాలు రాకపోవడంతో.. బ్యాంక్ ద్వారా రుణం తీసుకుని ట్యాక్సీ నడుపుకోవడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే  జమాల్ పాక్ డొమెస్టిక్, లీగ్, టెలివిజన్ క్రికెట్ లో సత్తాచాటుతూ.. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకునే వరకు ఎదిగాడు. 2022 ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు జమాల్. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కంగారు గడ్డపై మిగతా బౌలర్లు విఫలం అవుతున్న వేళ తన పేస్ బౌలింగ్ తో ఇప్పటికే 18 వికెట్లను నేలకూల్చాడు జమాల్. మూడో టెస్ట్ లో 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులకే కట్టడిచేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఈ టెస్ట్ లో పాక్ తొలి ఇన్నింగ్స్ లో 313 రన్స్ చేసిందంటే.. దానికి కారణం జమాలే. 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 82 పరుగులు చేశాడు. ఒకవైపు ఆసీస్ బౌలర్లకు మిగతా బ్యాటర్లు దాసోహం అవుతున్న వేళ.. ఒకప్పటి ఇమ్రాన్ ఖాన్ ను గుర్తుకు తెచ్చే ఇన్నింగ్స్ తో మెరిశాడు జమాల్. కష్టాల్లో ఉన్న జట్టును ఇమ్రాన్ ఖాన్ తనదైన బ్యాటింగ్ తో, బౌలింగ్ తో విజయతీరాలకు తీర్చేవాడు. ఇప్పుడు ఇదే తరహా ఆటను జమాల్ చూపిస్తున్నాడు. దీంతో 32 ఏళ్ల తర్వాత పాక్ జట్టులోకి మరో ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు అంటూ క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఆసీస్ గడ్డపై వరల్డ్ క్లాస్ బౌలర్లుగా పేరుగాంచిన స్టార్క్, కమ్మిన్స్, హేజిల్ వుడ్, లియోన్ బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడటం మామూలు విషయం కాదు. మరి ఆస్ట్రేలియా గడ్డపై వారినే వణికించిన జమాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments