SNP
Glenn Maxwell, Australia vs Oman, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లోకి వచ్చినా.. మ్యాక్స్‌వెల్ దరిద్రం మాత్రం పోలేదు. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. అయితే.. క్యాచ్ మాత్రం అద్భుతమని చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Glenn Maxwell, Australia vs Oman, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లోకి వచ్చినా.. మ్యాక్స్‌వెల్ దరిద్రం మాత్రం పోలేదు. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. అయితే.. క్యాచ్ మాత్రం అద్భుతమని చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
ఐపీఎల్‌లో చెత్త ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇంకా అదే చెత్త ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కాబట్టి అలా ఆడాడు.. ఒక్కసారి ఆస్ట్రేలియా జెర్సీ వేసుకుని దేశం తరఫున బరిలోకి దిగితే.. అసలైన మ్యాక్స్‌వెల్‌ను చూస్తారని చెప్పిన వారిని నిరాశపరుస్తూ.. టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యాడు మ్యాక్సీ. ఎదుర్కొన్న తొలి బంతికే అద్భుతమైన షాట్ ఆడినా.. మ్యాక్స్‌వెల్ దురదృష్టం కొద్ది ఫీల్డర్ అత్యాద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో.. మ్యాక్సీని ఇంకా దరిద్రం వీడినట్టు లేదంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మ్యాక్స్‌వెల్ తన చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 5 సార్లు డకౌట్ అయ్యాడు. అందులో మూడు గోల్డెన్ డకౌట్లు ఉండటం గమనార్హం.
బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో బుధవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 51 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 56 పరుగులు చేసి.. వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ట్రావిస్ హెడ్ 12, కెప్టెన్ మిచెల్ మార్ష్ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. మెహ్రన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతిని కవర్స్ వైపు మ్యాక్స్‌వెల్ అద్భుతమైన షాట్ ఆడాడు. కానీ, అక్కడే ఉన్న షోయబ్ ఖాన్ తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూస్తే.. మ్యాక్స్‌వెల్‌కే మైండ్ పోయింది.
ఇక చేసేది ఏం లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ.. పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కానీ, స్టార్ ఆల్‌రౌండర్ స్టోయినీస్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 67 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది ఆసీస్. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు కాస్త పోటీ ఇచ్చింది. ఒమన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయాన్ ఖాన్ 36, మెహ్రన్ ఖాన్ 27 పరుగులు చేసి రాణించినా.. ఒమన్‌ను గెలిపించలేకపోయారు. మొత్తంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ డకౌట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Golden Duck for Glenn Maxwell in T20 worldcup now against mighty Oman🔥🔥
He have 5 ducks in last 10 innings, 3 of them are golden ducks🦆 pic.twitter.com/jlrzj4ZE38
— TukTuk Academy (@TukTuk_Academy) June 6, 2024