SNP
Anil Kumble, Arshdeep Singh, Siraj, T20 World Cup 2024: వరల్డ్ కప్ ఆడుతున్న భారత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఓ ప్లేయర్‌ను తప్పించాలని అనిల్ కుంబ్లే సూచించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Anil Kumble, Arshdeep Singh, Siraj, T20 World Cup 2024: వరల్డ్ కప్ ఆడుతున్న భారత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఓ ప్లేయర్‌ను తప్పించాలని అనిల్ కుంబ్లే సూచించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించి.. ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించింది. శనివారం కెనడాతో నామమాత్రపు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత.. సూపర్ 8లో భాగంగా జూన్ 20, 22, 24న మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న టీమిండియాలో ఒక మార్పు చేయాలని టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న టీమ్ నుంచి ఓ స్టార్ బౌలర్‌ను పక్కనపెట్టేయాలని అన్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు పక్కనపెట్టమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
వెస్టిండీస్ పిచ్‌లు స్పిన్‌కు కాస్త అనుకూలంగా ఉంటాయని, అందుకోసం ప్రస్తుతం ఆడుతున్న ముగ్గురు పేసర్లలో ఒకర్ని పక్కనపెట్టి, స్పిన్నర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని కుంబ్లే సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్సదీప్ సింగ్ ముగ్గురు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కుంబ్లే స్పిన్నర్లు ఆడించాలని అందుకోసం మొహమ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలన్నాడు. బుమ్రాతో పాటు అమెరికా మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో విజృంభించిన అర్షదీప్ సింగ్‌ను కొనసాగించాలని కుంబ్లే సూచించాడు. జట్టులో హార్దిక్ పాండ్య రూపంలో మూడో పేసర్ ఉన్నాడని, దాంతో సిరాజ్ అవసరం జట్టుకు ఉండదని అన్నాడు.
వెస్టిండీస్‌లోని పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే భారత్‌కు మంచిదని అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ఇప్పటికే జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.. వీరికి కుల్దీప్ యాదవ్ లేదా యుజ్వేంద్ర చాహల్ యాడ్ అయితే బాగుంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. అందుకోసం సిరాజ్‌ను పక్కనపెట్టడమే ఉత్తమం అన్నాడు. ఎందుకంటే.. బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని.. అందుకే సిరాజ్‌ను టీమ్ నుంచి తీసేయలని అన్నాడు. మరి కుంబ్లే సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Anil Kumble Said : “The way Arshdeep Singh can bowl in different areas in the T20 game, I think certainly puts him ahead of Mohammed Siraj” (Espencricinfo)
— Vipin Tiwari (@Vipintiwari952_) June 13, 2024