iDreamPost
android-app
ios-app

Angelo Mathews: క్రికెట్ చరిత్రలో అత్యంత వరస్ట్ ఔట్ ఇదే అనుకుంటా! వీడియో వైరల్..

  • Published Feb 06, 2024 | 10:02 AM Updated Updated Feb 06, 2024 | 10:02 AM

శ్రీలంక వర్సెస్ ఆఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ అవుట్ నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీలంక వర్సెస్ ఆఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ అవుట్ నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Angelo Mathews: క్రికెట్ చరిత్రలో అత్యంత వరస్ట్ ఔట్ ఇదే అనుకుంటా! వీడియో వైరల్..

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. గ్రౌండ్ లో ఆటగాళ్లు చేసే విన్యాసాలు ఒక్కోసారి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తుంటాయి కూడా. ఇక మరికొన్ని సందర్భాల్లో బ్యాటర్లు అత్యంత దరిద్రంగా పెవిలియన్ చేరుతూ ఉంటారు. అలాంటి వరస్ట్ అవుట్ ఒకటి తాజాగా నమోదు అయ్యింది. శ్రీలంక వర్సెస్ ఆఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఈ వరస్ట్ అవుట్ చోటు చేసుకుంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ ఇందుకు కేంద్ర బిందువుగా మారాడు. ప్రస్తుతం ఈ ఔట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

శ్రీలంక వర్సెస్ ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఔట్ నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తోంది. అప్పుడు క్రీజ్ లో మాథ్యూస్, సమరవిక్రమ ఉన్నారు. ఈ క్రమంలోనే బౌలింగ్ కు వచ్చాడు కైస్ అహ్మద్. ఈ ఓవర్ రెండో బాల్ ను లెగ్ సైడ్ భారీ వైడ్ గా సంధించాడు. అయితే మాథ్యూస్ ఆ బాల్ ను వెంటాడి మరీ భారీ షాట్ కొట్టాడు. బాల్ బౌండరీ వెళ్లింది. ఇంకేంటి మరి? అని అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. భారీ షాట్ కొట్టిన మాథ్యూస్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అతడి బ్యాట్ వికెట్లను తాకింది. ఇంకేముంది హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు ఈ స్టార్ ప్లేయర్.

worest out in cricket history 1

అప్పటికే అతడు 259 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 141 పరుగులు చేసి.. జట్టుకు భారీ అధిక్యాన్ని అందించాడు. ఇక ఈ ఔట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. దురదృష్టం అంటే నీదే భయ్యా.. అప్పుడు టైమ్డ్ అవుట్, ఇప్పుడు ఇలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వరస్ట్ ఔట్ అని మరికొందరు రాసుకొచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ ను చిత్తు చేసి, ఏకైక టెస్ట్ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఆఫ్గాన్ తొలి ఇన్నింగ్స్ లో 198, రెండో ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 439, రెండో ఇన్నింగ్స్ లో 56 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ విచిత్రమైన ఔట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: రెండో టెస్ట్ లో ఓటమి.. పర్యటన మధ్యలోనే దుబాయ్ కు ఇంగ్లాండ్! కారణం?