iDreamPost
android-app
ios-app

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విధ్వంసకర బ్యాటర్‌! చివరి మ్యాచ్‌ ఎప్పుడంటే?

  • Published Feb 09, 2024 | 6:18 PM Updated Updated Feb 09, 2024 | 6:18 PM

టీ20 క్రికెట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాడు, విధ్వంస బ్యాటింగ్‌కు పర్యాయపదం, నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ క్రికెటర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరి అతనెవరూ.. చివరి మ్యాచ్‌ ఎప్పుడో ఇప్పుడు చూద్దాం..

టీ20 క్రికెట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాడు, విధ్వంస బ్యాటింగ్‌కు పర్యాయపదం, నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ క్రికెటర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరి అతనెవరూ.. చివరి మ్యాచ్‌ ఎప్పుడో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 09, 2024 | 6:18 PMUpdated Feb 09, 2024 | 6:18 PM
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విధ్వంసకర బ్యాటర్‌! చివరి మ్యాచ్‌ ఎప్పుడంటే?

క్రికెట్‌లో విధ్వంసపు బ్యాటింగ్‌ పర్యాయపదంగా నిలిచిన ఓ స్టార్‌ క్రికెట్‌ తాజాగా టీ20 క్రికెట్‌ను ఎప్పుడు తప్పుకుంటున్నాడో వెల్లడించాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపాడు. ఈ విషయాన్ని నేరుగా ఆ దేశ క్రికెట్‌ బోర్డుకే చెప్పాడు. ఇంతకి ఆ క్రికెటర్‌ ఎవరనుకుంటున్నారా? వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌. జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లోనే ఎక్కువగా కనిపించే ఈ కరేబియన్‌ వీరుడు.. తాజాగా ఆ దేశ క్రికెట్‌ బోర్డుతో సమావేశమై.. తన రిటైర్మెంట్‌ విషయం వెల్లడించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ జట్టులో రస్సెల్‌ కూడా ఉన్నాడు.

ఈ సిరీస్‌ ముందే వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుతో జరిగిన సమావేశంలో తన నిర్ణయం చెబుతూ.. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకుంటానని, దేశానికి తన అవసరం ఉందని బోర్డు భావిస్తే.. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటానని కూడా రస్సెస్‌ స్పష్టం చేశాడు. దీంతో.. రస్సెల్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో తన చివరి మ్యాచ్‌ ఆడనున్నాడు. కాగా, బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా చాలా కాలంగా రస్సెల్‌ జాతీయ జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌, రస్సెల్‌ వీళ్లంతా వెస్టిండీస్‌ జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వారివారి కారణాలు వారికున్నాయి. అయితే.. రస్సెల్‌ టీ20 క్రికెట్‌లో అద్బుతమైన ఆల్‌రౌండర్‌.

తన కెరీర్‌లో వెస్టిండీస్‌ తరఫున మొత్తం 72 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఆ 72 మ్యాచ్‌ల్లో 62 ఇన్నింగ్స్‌ల్లో 846 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన కెరీర్‌లో ఒక టెస్ట్‌, 56 వన్డేలు ఆడిన రస్సెల్‌ టెస్టుల్లో 2, వన్డేల్లో 1034 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే టెస్టుల్లో ఒక వికెట్‌, వన్డేల్లో 70, టీ20ల్లో 46 వికెట్లు తీశాడు. ఇలా ఒక ఆల్‌రౌండర్‌ మంచి కెరీర్‌నే కలిగి ఉన్నాడు. 2010లో టెస్ట్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి రస్సెల్‌.. 2011లో వన్డేలు, టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. తన కెరీర్‌లో ఒకే ఒక టెస్ట్‌ ఆడాడు. మరి రస్సెల్‌ ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.