iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీ విషయంలో అలా చేయడం పిచ్చితనం: ఆండ్రీ రస్సెల్!

ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ మీదే ఉంది. కానీ, మరోవైపు ఇండియన్ ఫ్యాన్స్ లో టీ20 వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాని సెలక్ట్ చేస్తారా? లేదా? అనే ప్రశ్న తొలిచేస్తోంది.

ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ మీదే ఉంది. కానీ, మరోవైపు ఇండియన్ ఫ్యాన్స్ లో టీ20 వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాని సెలక్ట్ చేస్తారా? లేదా? అనే ప్రశ్న తొలిచేస్తోంది.

రోహిత్, కోహ్లీ విషయంలో అలా చేయడం పిచ్చితనం: ఆండ్రీ రస్సెల్!

టీ20 వరల్డ్ కప్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ పొట్టి క్రికెట్ టోర్నీ గురించే మాట్లాడుతోంది. ఏ జట్టు బలం ఎలా ఉండబోతోంది? ఎవరికి ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుంది? ఏ ప్లేయర్ ఎలా ఆడబోతున్నాడు? అంటూ ప్రణాళికలు, వ్యూహాలు, చర్చోపచర్చలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇండియాలో పరిస్థితి మరోలా ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ కోహ్లీ ఉంటారా? ఉండరా? వీళ్లు లేకపోతే జట్టు పరిస్థితి ఏంటి? అంటూ తెల్లముఖాలు వేస్తున్నారు. ఈ ప్రశ్నకు కరేబియన్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ సమాధానం చెప్పాడు. అలాగే బీసీసీఐని హెచ్చరించాడు కూడా.

ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టనట్లు చెప్పడంలో కరేబియన్ ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. అలాంటి జాబితాలో ఆండ్రీ రస్సెల్ పేరు కూడా ఉంటుంది. తాజాగా రస్సెల్ ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించాడు. ఆ సందర్భంగా పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఆ సందర్భంగా రస్సెల్ కు విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానం చెబుతూ.. “ఈ మధ్య ఆటగాళ్ల ప్రతిభ, నైపుణ్యాల గురించి డిబేట్లు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. అయినా రోహిత్, విరాట్ కోహ్లీ గురించి ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. రోహిత్ శర్మ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. ఇంక విరాట్ అయితే ఎంతో పెద్ద ప్లేయర్.

వీళ్లిద్దరిని గనుక వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకపోతే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అది కచ్చితంగా పిచ్చితనమే అవుతుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి మీరు కేవలం కుర్రాళ్లనే ఎంపిక చేసి పంపలేరుగా? 11 మంది యువ సైనికులను యుద్ధానికి పంపలేరుగా. వారితో పాటు సీనియర్లు ఉండాల్సిందే. వరల్డ్ కప్ లాంటి టోర్నీలో సీనియర్లు ఉండటం కూడా అంతే ముఖ్యం. సెలక్షన్ కమిటీ కచ్చితంగా సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే” అంటూ ఆండ్రీ రస్సెల్ చెప్పుకొచ్చాడు. ఇది నిజానికి కేవలం ఫ్యాన్స్ కోసం చెప్పిన సమధానం మాత్రమే కాదు.. బీసీసీఐ సెలక్షన్ కమిటీకి ఇచ్చిన హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు. రస్సెల్ చెప్పినట్లు జట్టులో సీనియర్లు లేకుండా కేవలం కుర్రాళ్లను మాత్రమే ఎంపిక చేస్తే.. అది సైన్యాధిపతి లేకుండా యువ సైనికులను యుద్ధ క్షేత్రానికి పంపినట్లే అవుతుంది.

మరి.. బీసీసీఐ ఎలాంటి ఆలోచనలు చేస్తోందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇంక విరాట్- రోహిత్ టీ20ల విషయానికి వస్తే.. టీ20 వరల్డ్ 2022 తర్వాత వాళ్లు పొట్టి క్రికెట్ ఆడింది లేదు. వరల్డ్ కప్ 2023 తర్వాత రోహిత్- విరాట్ కోహ్లీలు టీ20లకు వీడ్కోలు పలుకుతారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అసలు విరాట్- రోహిత్ టీ20ల్లో కొనసాగుతారా? లేదా? అంటూ ఫ్యాన్స్ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. మరి.. విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ లో ఆడాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.