SNP
SNP
ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి 27 వరకు ఈ టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లన్నీ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరగనున్నాయి. కాగా, ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. అవి.. ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్ జట్లు ఉన్నాయి. ఈ ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
ఈ టోర్నీకి సంబంధించిన వేలం కూడా ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి భారీ ధర పలికాడు. రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజ్ అతన్ని రూ.6.6 లక్షల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అలాగే ఉత్తరాంధ్ర జట్టు కేఎస్ భరత్‌ను, బెజవాడ టైగర్స్ టీమ్ రికీ భుయ్‌ని రిటేన్ చేసుకున్నాయి. వీరితో పాప్ఘెం ధీరజ్‌కుమార్ రూ.5.2 లక్షలు, యర్రా పృథ్వీ రాజ్ రూ.5 లక్షలు, అశ్విన్ హెబ్బార్ రూ.5 లక్షల ధర పలికారు. వీరితో పాటు మరికొంతమందికి మంచి ధర వచ్చింది. తమిళనాడులో జరిగే లీగ్‌లానే ఈ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కూడా జరగనుంది.
ఇక లీగ్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది..
ఆగస్టు 16న సాయంత్రం 5 గంటలకు కోస్టల్ రైడర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు వైజాగ్ వారియర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 17న మధ్యాహ్నం 3 గంటలకు రాయలసీమ కింగ్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 18న మధ్యాహ్నం 12 గంటలకు కోస్టల్ రైడర్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 18న సాయంత్రం 5 గంటలకు బెజవాడ టైగర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు బెజవాడ టైగర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 19న మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరాంధ్ర లయన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 20న ఉదయం 10 గంటలకు ఉత్తరాంధ్ర లయన్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 20న మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి టైటాన్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు బెజవాడ టైగర్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 21న సాయంత్రం 5 గంటలకు రాయలసీమ కింగ్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 22న మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి టైటాన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 22న సాయంత్రం 5 గంటలకు వైజాగ్ వారియర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 23న మధ్యాహ్నం 12 గంటలకు కోస్టల్ రైడర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 23న సాయంత్రం 5 గంటలకు ఉత్తరాంధ్ర లయన్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఎలిమినేటర్
ఆగస్టు 25న సాయంత్రం 5 గంటలకు క్వాలిఫైయర్ 1
ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలకు క్వాలిఫైయర్ 2
ఆగస్టు 27న సాయంత్రం 5 గంటలకు ఫైనల్
Andhra Premier League 2023 schedule, date, time table | APL 2023 https://t.co/7iHMRWT5Cj
— Sports Live (@iplt20live_in) August 8, 2023
ఇదీ చదవండి: ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డ్ మరే క్రికెటర్‌కు లేదు! పృథ్వీ షా ఒక్కడే ఘనుడు