iDreamPost
android-app
ios-app

6 బంతుల్లో 6 సిక్సులు.. టీ20లో కాదు భయ్యా.. టెస్టుల్లో!

  • Published Feb 21, 2024 | 8:29 PM Updated Updated Feb 21, 2024 | 8:45 PM

6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించాడు ఆంధ్ర బ్యాటర్ మామిడి వంశీకృష్ణ. ఈ రికార్డుతో పాటుగా ఫాస్టెస్ట్ హండ్రెడ్ ను కూడా ఈ టోర్నీలో నమోదు చేశాడు.

6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించాడు ఆంధ్ర బ్యాటర్ మామిడి వంశీకృష్ణ. ఈ రికార్డుతో పాటుగా ఫాస్టెస్ట్ హండ్రెడ్ ను కూడా ఈ టోర్నీలో నమోదు చేశాడు.

6 బంతుల్లో 6 సిక్సులు.. టీ20లో కాదు భయ్యా.. టెస్టుల్లో!

ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ ప్రవేశించిందో.. అప్పటి నుంచి వరల్డ్ క్రికెట్ పొకడ మారిపోయింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడాలేకుండా బ్యాటర్లు తమ బ్యాట్ లకు పని చెబుతున్నారు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు బ్యాటర్లు. తాజాగా జరుగుతున్న సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్-23 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రైల్వేస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టడమే కాకుండా..

సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్-23 టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ దుమ్మురేపాడు. రైల్వేస్ టీమ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మామిడి వంశీకృష్ణ రికార్డ్ సెంచరీతో చెలరేగాడు. రైల్వేస్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 64 బంతుల్లోనే 9 ఫోర్లు, 10 సిక్సులతో 110 పరుగులు చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ 48 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి.. ఈ టోర్నీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇక ఈ మ్యాచ్ లో మరో రేర్ ఫీట్ ను సాధించాడు. రైల్వేస్ స్పిన్నర్ దమన్ దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో ఏకంగా 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచింది. గతంలో ఫార్మాట్ తో సంబంధం లేకుండా చాలా మంది ప్లేయర్లు ఒకే ఓవర్ లో 6 సిక్సులు బాదారు. వంశీకృష్ణ రికార్డు సెంచరీ సాధించడంతో.. ఆంధ్ర టీమ్ తొలిరోజే 7 వికెట్లు కోల్పోయి 372 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏంటి భయ్యా ఇది టీ20 అనుకుంటున్నావా? లేక వన్డే అనుకుంటున్నావా? బహుశా టెస్ట్ మ్యాచ్ అని మర్చిపోయాడు అనుకుంటా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన ఆంధ్ర ఓపెనర్ వంశీకృష్ణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమిండియా-ఇంగ్లాండ్ 4వ టెస్ట్ కు ఉగ్రవాదుల బెదిరింపులు!