iDreamPost
android-app
ios-app

Ambati Rayudu: రాయుడు గొప్ప మనసు.. అవకాశాలు ఇవ్వకపోయినా అందళానికి ఎత్తేశాడు!

  • Published Jan 01, 2024 | 8:24 PM Updated Updated Jan 01, 2024 | 8:24 PM

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Ambati Rayudu: రాయుడు గొప్ప మనసు.. అవకాశాలు ఇవ్వకపోయినా అందళానికి ఎత్తేశాడు!

అంబటి తిరుపతి రాయుడు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. గత కొంత కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాడు రాయుడు. అతడు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘ఐడ్రీమ్ మీడియా’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు రాయుడు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి, క్రికెట్ కెరీర్ గురించి.. అందులో తాను ఎదుర్కొన్న కష్టనష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ లో అవకాశాలు రాకుండా అడ్డుకున్న వాళ్లను కూడా ఎంతో హుందాగా, గొప్ప మనసుతో ఒక్క మాటకూడా అనలేదు. ఇందుకే రాయుడిని గ్రేట్ అనేది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నా నెటిజన్లు, ఫ్యాన్స్.

సాధారణంగా ఏ క్రికెటర్ కి అయినా.. సుదీర్ఘకాలం దేశానికి ప్రాతినిథ్యం వహించాలని ఉంటుంది. అందుకోసం ఎంతటి కష్టాలనైనా తట్టుకుంటూ, ముందుకు సాగుతూ ఉంటారు. నేనూ అలాగే సాగాను అంటూ చెప్పుకొచ్చాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘ఐడ్రీమ్ మీడియా’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘కెరీర్ లో 50 టెస్టు మ్యాచ్ లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్ రాయుడు అని వెంగ్ సర్కార్ ప్రశంసించారు. మీ క్రికెట్ కెరీర్ గురించి ఎలా ఫీలవుతున్నారు’ అని యాంకర్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు అంబటి రాయుడు సమాధానం ఇస్తూ..”నా క్రికెట్ కెరీర్ పై నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరి అండదండలు లేకపోయినా.. ఇన్ని సంవత్సరాలు అందులో ఉండగలగడం గ్రేట్. ఇక నేను దాదాపు 7 సంవత్సరాలు సీనియర్ జట్టుతో ఉన్నాను. కానీ ఆడే అవకాశాలు నాకు తక్కువ దొరికాయి. అయితే జట్టుతో సుమారు 200 మ్యాచ్ లకు కలిసి ప్రయాణం చేశా. అయితే అందరి కెరీర్ ఒకేలా ఉండదు. ఇక కెరీర్ లో గొప్ప మూమెంట్ ఏదన్నా ఉందంటే.. అది ఇండియా క్యాప్ తీసుకోవడమే” అంటూ చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు.

కాగా.. రాయుడు అద్భుతమై ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఐపీఎల్ లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన జట్టులో సభ్యుడు కావడం విశేషం. ఇంతటి టాలెంటెడ్ ప్లేయర్ ను కొందరు కావాలనే తొక్కేశారనే వార్తలు కూడా గతంలో చాలానే వచ్చాయి. అవన్నీ రాయుడికి తెలిసినప్పటికీ.. వాటి గురించి, ఆ వ్యక్తుల గురించి ఇసుమంతైనా మాట్లాడకుండా, ఎంతో హుందాగా సమాధానాలు ఇచ్చాడు. తనకు అవకాశాలు ఇవ్వకపోయినా.. వారిని అందళానికి ఎత్తేసినట్లు మాట్లాడాడు. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇందుకే రాయుడిని గ్రేట్ అనేది అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీపై, ఇతర విషయాల గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.