iDreamPost
android-app
ios-app

Ambati Rayudu: అతని కొడుకు కోసమే నా కెరీర్ ను నాశనం చేశాడు! అంబటి రాయుడు సంచలన కామెంట్స్

  • Author Soma Sekhar Published - 04:43 PM, Wed - 14 June 23
  • Author Soma Sekhar Published - 04:43 PM, Wed - 14 June 23
Ambati Rayudu: అతని కొడుకు కోసమే నా కెరీర్ ను నాశనం చేశాడు! అంబటి రాయుడు సంచలన కామెంట్స్

అంబటి రాయుడు.. గత కొంతకాలంగా వార్తల్లో తరచుగా వినిపిస్తున్న పేరు. 2023 ఐపీఎల్ సీజన్ తో తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు ఈ తెలుగు తేజం. అనంతరం రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు రాయుడు. దాంతో అతడి పొలిటికల్ ఎంట్రీ ఖాయం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన రాజకీయాల గురించి వెల్లడించాడు. అసోసియేషన్ లో పై స్థాయిలో ఉన్న వ్యక్తి తన కొడుకును టీమిండియాకు ఆడించాలని నా కెరీర్ ను నాశనం చేశాడు అంటూ వాపోయాడు రాయుడు.

అంబటి తిరుపతి రాయుడు.. నిలకడకైన ఆటకు పెట్టింది పేరుగా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్ లో అయితే సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. దాంతో 2019 వరల్డ్ కప్ లో తప్పకుండా రాయుడికి చోటు దక్కుతుంది అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాయుడి స్థానంలో విజయ్ శంకర్ కు అవకాశం ఇచ్చారు. దాంతో రాయుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఇలాంటి సంఘటనలు తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయంటున్నాడు రాయుడు. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నా చిన్నతనం నుంచే రాజకీయాలు ఉన్నాయని రాయుడు చెప్పుకొచ్చాడు. టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ వల్లే తాను ఇండియన్ టీమ్ కు సుదీర్ఘకాలం ఆడలేకపోయాను అని రాయుడు వాపోయాడు. శివలాల్ యాదవ్ కొడుకు అర్జున్ యాదవ్ ను టీమిండియాకు ఆడించాలని, నా కెరీర్ ను అతడు నాశనం చేశాడు అంటూ రాయుడు చెప్పుకొచ్చాడు. అర్జున్ కన్నా నేను మెరుగ్గా ఆడుతున్నాను అన్న కారణంతో నన్ను అడ్డుతొలగించే ప్రయత్నం చేశారు. అప్పటికి నాకు 17 సంవత్సరాలే. HCAలో జరుగుతున్న రాజకీయాలపై బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి మరింత దిగజారుతుందని రాయుడు హెచ్చరించాడు.

ఈ క్రమంలోనే శివలాల్ యాదవ్ కు సంబంధించిన సన్నిహితులు సెలక్షన్ ప్యానల్ కు రావడంతో.. నాకు అవకాశాలు దక్కలేదు. శివలాల్ తమ్ముడు తాగొచ్చి మా ఇంటి ముందు గొడవ చేసేవాడు. దాంతో నేను మానసికంగా కుంగిపోయాను. దాదాపు 7-8 సంవత్సరాలు ఫోన్ కూడా వాడలేదు. నాకు చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చాకే పేరొచ్చింది. ధోని నన్ను వేదిక మీదకు పిలిచి ట్రోఫీని అందుకోమన్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసిందని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు.