Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024.. తొలి మ్యాచ్ లోనే స్టార్ ప్లేయర్లంతా విఫలం!

Duleep Trophy 2024, Yashasvi Jaiswal, Shreyas Iyer, Rishab Pant: దులీప్ ట్రోఫీ 2024 గురువారం ప్రారంభం అయ్యింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిమ్యాచ్ లోనే టీమిండియా స్టార్ క్రికెటర్లు అంతా విఫలం అయ్యారు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు సైతం దారుణంగా ఫెయిల్ అయ్యారు.

Duleep Trophy 2024, Yashasvi Jaiswal, Shreyas Iyer, Rishab Pant: దులీప్ ట్రోఫీ 2024 గురువారం ప్రారంభం అయ్యింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిమ్యాచ్ లోనే టీమిండియా స్టార్ క్రికెటర్లు అంతా విఫలం అయ్యారు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు సైతం దారుణంగా ఫెయిల్ అయ్యారు.

ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 గురువారం ప్రారంభం అయ్యింది. నాలుగు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. బెంగళూరు, అనంతరపురం వేదికలుగా మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక తాజాగా ఇండియా-ఏ వర్సెస్ ఇండియా-బి జట్లు  చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతుండగా.. మరో మ్యాచ్ లో ఇండియా-సి వర్సెస్ ఇండియా-డి ఢీ కొంటున్నాయి. అయితే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్లు అంతా మూకుమ్మడిగా విఫలం అయ్యారు. మరీ ముఖ్యంగా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ గొప్పగా రాణించలేకపోయాడు. మరి దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే విఫలం అయిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం పదండి.

దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ వర్సెస్ ఇండియా-బి జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అయ్యింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా-ఏ కెప్టెన్ శుబ్ మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్ కు దిగింది ఇండియా-బి జట్టు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు యశస్వీ జైస్వాల్.  అయితే ఆవేశ్ ఖాన్ వేసిన అద్భుత బంతికి కెప్టెన్ ఈశ్వరన్(13) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరాడు. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జైస్వాల్ కూడా రాణించలేకపోయాడు. 59 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లతో 30 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఔటై నిరాశ పరిచాడు.

ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సర్పరాజ్ ఖాన్(9), రిషబ్ పంత్(7), నితీశ్ కుమార్ రెడ్డి(0) దారుణంగా విఫలం అయ్యారు. ఆకాశ్ దీప్ పంత్, నితీశ్ ను ఔట్ చేస్తే.. సర్పరాజ్ ను ఆవేశ్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. గత ఐపీఎల్ లో దుమ్మురేపిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్.. ఈ మ్యాచ్ లో పూర్తిగా బ్యాటెత్తేశాడు. దాంతో 89 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది ఇండియా-బి టీమ్. కారు ప్రమాదం తర్వాత టీ20 వరల్డ్ కప్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. ఆ టోర్నీలో ఆకట్టుకున్నాడు. అయితే అదే జోరును దులీప్ ట్రోఫీలో చూపించడంలో మాత్రం విఫలం అయ్యాడనే చెప్పాలి. సీనియర్ ప్లేయర్ గా వికెట్లు పడుతుంటే.. జట్టును ఆదుకోవాల్సిన టైమ్ లో చేతులెత్తేశారు పంత్ తో సహా మిగతా స్టార్లు.

ఇదిలా ఉండగా.. మరో మ్యాచ్ లో ఇండియా-డికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ 9 రన్స్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దేవ్ దత్ పడిక్కల్ డకౌట్ గా వెనుదిరిగి టీమిండియాలోకి వచ్చే ఆశలను క్లిష్టం చేసుకుంటున్నాడు. ఇక ఇండియా సితో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా డి జట్టు 76 రన్స్ కే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ వైపు సాగుతోంది. కాగా.. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక్కడ రాణించిన వారినే నెక్ట్స్ సిరీస్ కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో తొలి మ్యాచ్ లోనే జైస్వాల్, పంత్, నితీశ్ కుమార్, శ్రేయస్ అయ్యర్, పడిక్కల్ లాంటి స్టార్లు విఫలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments