Krishna Kowshik
టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలో ముంబై తరుఫున ఆడుతున్నాడు ఈ ఆల్ రౌండర్. ఇంతకు ఏమైందంటే..?
టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలో ముంబై తరుఫున ఆడుతున్నాడు ఈ ఆల్ రౌండర్. ఇంతకు ఏమైందంటే..?
Krishna Kowshik
టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విపరీతమైన జ్వరంతో బాధపడుతుటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలో ముంబై తరుఫున ఆడుతున్నాడు ఈ ఆల్ రౌండర్. 102 ఫీవర్ వచ్చినా జట్టు కోసం ఫీల్ట్‌లోకి దిగాడు ఈ క్రికెటర్. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి 73 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. బ్యాటింగ్ చేసిన తర్వాత లక్నోలోని హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ మధ్యలోనే కాలికి గాయం అయ్యి.. క్రికెట్‌కు దూరంగా ఉన్న శార్దూల్.. కోలుకుని ఇరానీ ట్రోఫీతోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. తొలి రోజు అనారోగ్యంతో కనిపించాడు శార్దూల్. రెండో రోజు ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన ఈ ప్లేయర్.. 10వ స్థానంలో క్రీజులోకి దిగడంతో క్రీడాభిమానులు ఏమైంది అన్న సందేహం కలిగింది.
మ్యాచ్ అనంతరం ఆసుపత్రిలో చేరడంతో ఫీవర్ అని తేలింది. అంత జ్వరంలో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు శార్దూల్. సర్పరాజ్ డబుల్ సెంచరీ చేయడానికి సహకరించాడు. ఇరానీ ట్రోఫీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ముంబై బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ మ్యాచ్‌లో మొత్తం 59 బంతుల్లో 36 పరుగులు చేశాడు శార్దూల్. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఈ ఆల్ రౌండ్, నాలుగో రోజు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫీవర్ తగ్గకుంటే ఈ టెస్టుకు రెస్టు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా సెకండ్ టెస్టులో బరిలోకి దిగనున్నారు ఈ స్టార్ క్రికెటర్. ప్రస్తుతం శార్దూల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది.
గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బాలో టీమిండియాకి చారిత్రక విజయం అందించిన భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతని సగటు దాదాపు 70కి చేరువగా ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇరానీ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 141 ఓవర్లలో 537 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. పృథ్వీ షా 4, ఆయుష్ మాత్రే 19, శామ్స్ ములానీ 5 పరుగులు చేయగా హార్దిక్ తామోర్, మోహిత్ అవస్తీ, జునైద్ ఖాన్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ అజింకా రహానే 234 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 97 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్సర్లతో 222 పరుగులు అజేయంగా నిలిచాడు.