iDreamPost
android-app
ios-app

వామ్మో.. ఒక ప్లేయర్‌ టీమ్‌ మారేందుకు రూ.808 కోట్ల ఇచ్చారా?

  • Published Aug 17, 2023 | 3:52 PM Updated Updated Aug 17, 2023 | 3:52 PM
  • Published Aug 17, 2023 | 3:52 PMUpdated Aug 17, 2023 | 3:52 PM
వామ్మో.. ఒక ప్లేయర్‌ టీమ్‌ మారేందుకు రూ.808 కోట్ల ఇచ్చారా?

వరల్డ్స్‌ రిచెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌గా చెప్పుకునే ఐపీఎల్‌లో క్రికెటర్లకు వేలంలో లభించే ధర చూసి చాలా మంది కళ్లు తేలేసి ఉంటారు. నిజానికి ఐపీఎల్‌ వేలంతో చాలా మంది క్రికెటర్ల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ప్రాక్టీస్‌కి పైసలు లేనోళ్లు కూడా.. ఐపీఎల్‌ తర్వాత లగ్జరీ కార్లులో ప్రాక్టీస్‌కు వచ్చే మంచి రోజులొచ్చాయి. అయితే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఓ ఆటగాడికి ఇచ్చిన అత్యధిక ధర రూ.18.5 కోట్లు. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ఈ భారీ ధరను ఐపీఎల్‌ వేలం 2023లో పొందాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.

అయితే.. ఐపీఎల్‌తో మరే క్రికెట్‌ లీగ్‌ కూడా పోటీ పడలేకపోతుంది. కానీ, క్రికెట్‌ కంటే ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఎక్కువ క్రేజ్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఫుట్‌బాల్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో సంపాదన కూడా అదే రేంజ్‌లో ఉంది. అందుకే ఇదే చక్కటి ఉదాహరణ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టార్‌ ఫుట్‌బాలర్‌ నైమార్‌కు సంబంధించిన ఓ విషయం సంచలనం సృష్టిస్తోంది. ఈ బ్రెజిల్ స్టార్ ఆటగాడు ఆరేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న పారిస్ సెయింట్ జర్మెన్(పీఎస్‌జీ) జట్టుకు వీడి.. కొత్త క్లబ్‌ టీమ్‌లో చేరాడు.

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఇలా ఒక క్లబ్‌ టీమ్‌ నుంచి మరో క్లబ్‌కు మారడం సాధారణమే అనుకుంటున్నారా? కానీ, ఇక్కడ నైమార్‌ను తమ క్లబ్‌లోకి తీసుకునేందుకు అల్‌ హిలాల్‌ జట్టు.. పీఎస్‌జీ క్లబ్‌కు ఏకంగా 98 మిలియన్‌ యూఎస్‌ డాలర్లను చెల్లించింది. మన ఇండియన్‌ కరెన్సీలో అక్షరాల రూ.808 కోట్ల పై మాట. ఓ ఆటగాడిని తీసుకునేందుకు ఇంత భారీ మొత్తంలో చెల్లించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ 98 మిలియన్లతో పాటు అల్‌ హిలాల్‌ జట్టు నైమార్‌కు ప్రతి ఏటా 100 మిలియన్ల డాలర్లలు పారితోషకం అందించనుంది. సౌదీ ప్రో లీగ్‌లో నైమార్‌ అల్‌ హిలాల్‌ టీమ్‌కు ఆడనున్నాడు. మరి ఇంత భారీ మొత్తం చెల్లించి ఓ ఆటగాడిని దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రసవత్తరంగా సాగుతున్న కరేబియన్‌ లీగ్‌! ఇక్కడ లైవ్‌ చూడండి..