iDreamPost
android-app
ios-app

Axar Patel: టీ20ల్లో అక్షర్ పటేల్ నయా రికార్డు! జడేజా తర్వాత..

  • Published Jan 15, 2024 | 10:32 AM Updated Updated Jan 15, 2024 | 10:32 AM

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో రోహిత్ తో పాటుగా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సైతం తన ఖాతాలో అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరసన నిలిచాడు.

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో రోహిత్ తో పాటుగా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సైతం తన ఖాతాలో అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరసన నిలిచాడు.

Axar Patel: టీ20ల్లో అక్షర్ పటేల్ నయా రికార్డు! జడేజా తర్వాత..

సమష్టి ప్రదర్శనతో రెండో టీ20లో ఆఫ్గానిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో పలు రికార్డులు క్రియేట్ అయ్యాయి. 150 టీ20 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రోహిత్ తో పాటుగా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సైతం తన ఖాతాలో అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరసన నిలిచాడు. మరి అక్షర్ పటేల్ సాధించిన రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షర్ పటేల్.. టీమిండియాలో స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటు బంతితో, అటు బ్యాట్ తో రాణిస్తున్నాడు. వరల్డ్ కప్ 2023 నుంచి అనూహ్యంగా జట్టుకు దూరం అయిన అక్షర్.. ఆ తర్వాత అద్భుత ఫామ్ తో సత్తాచాటుతున్నాడు. తాజాగా ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. వికెట్లు కూడా పడగొడుతున్నాడు. ఇక రెండో మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ చేసి మంచి జోరుమీదున్న గుల్బాదిన్ నైబ్ ను అవుట్ చేసి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్ లో సైతం 23 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

ఈ క్రమంలోనే ఓ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు అక్షర్. ఆఫ్గాన్ తో మ్యాచ్ లో నైబ్ వికెట్ కూల్చడం ద్వారా టీ20 క్రికెట్ లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 11వ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున 52 టీ20లు ఆడిన అక్షర్ 49 వికెట్లు తీశాడు. ఓవరాల్ గా 234 టీ20 మ్యాచ్ ల్లో 200 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్ లో బ్యాటింగ్ లోనూ 2,545 రన్స్ చేశాడు. ఇక ఈ జాబితాలో 200 వికెట్లతో పాటుగా, 2వేల పరుగులు చేసిన తొలి టీమిండియా ఆల్ రౌండర్ గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్నాడు అక్షర్. ఇక టీ20ల్లో 200 వికెట్లకు పైగా తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. చాహల్ 290 మ్యాచ్ ల్లో 336 వికెట్లు తీశాడు. మరి అక్షర్ పటేల్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.