Nidhan
Akash Deep Nine Wickets Haul In Duleep Trophy 2024: యంగ్ పేసర్ ఆకాశ్‌దీప్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన దమ్ము ఏంటో మరోమారు చూపించాడు. తన బౌలింగ్ రేంజ్ ఏంటనేది ఇంకోసారి ప్రూవ్ చేశాడు.
Akash Deep Nine Wickets Haul In Duleep Trophy 2024: యంగ్ పేసర్ ఆకాశ్‌దీప్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన దమ్ము ఏంటో మరోమారు చూపించాడు. తన బౌలింగ్ రేంజ్ ఏంటనేది ఇంకోసారి ప్రూవ్ చేశాడు.
Nidhan
దులీప్ ట్రోఫీ-2024లో సంచలనాలు కొనసాగుతున్నాయి. బాగా ఆడుతారని అనుకున్న స్టార్ ప్లేయర్లు దారుణంగా ఫ్లాప్ అవుతున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అద్భుతమైన ఆటతీరుతో స్టార్లకు షాక్ ఇస్తున్నారు. ఈ టోర్నీలో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గ్రౌండ్లోకి దిగిన ఓ పేస్ బౌలర్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. అతడు ఆకాశ్‌దీప్. ఇండియా ఏ తరఫున ఆడుతున్న ఈ స్పీడ్‌స్టర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ హాల్‌ను పూర్తి చేశాడు. ఇండియా బీ బ్యాటర్లను అతడు ముప్పుతిప్పలు పెట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి స్టార్లను అతడు ఔట్ చేశాడు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయాడు ఆకాశ్‌దీప్. ఇండియా బీ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో పాటు సెంచరీ హీరో ముషీర్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, నవ్‌దీప్ సైనీని కూడా అతడే ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన స్పెల్స్‌తో రెచ్చిపోయిన ఈ పేసర్ 14 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 మెయిడిన్లు కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మంచి పేస్, రిథమ్‌తో బౌలింగ్ చేస్తూనే వేరియేషన్స్ కూడా యూజ్ చేస్తూ పోయాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అతడికే బాల్ ఇచ్చాడు. ఆకాశ్ కూడా సారథి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బెస్ట్ ఇస్తూ పోయాడు. ప్రత్యర్థి టీమ్‌ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆకాశ్‌దీప్ చెలరేగడంతో ఇండియా బీ రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆ టీమ్ లీడ్ 275 పరుగులు చేరుకుంది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన ఇండియా ఏ ఇప్పుడు 6 వికెట్లకు 106 పరుగులతో ఉంది. కేఎల్ రాహుల్ (34 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రాహుల్ మీదే ఆ టీమ్ ఆశలన్నీ ఉన్నాయి. అతడు ఔట్ అయితే మ్యాచ్ కష్టమే. రాహుల్‌కు కుల్దీప్ ఎంతవరకు సపోర్ట్ అందిస్తాడో చూడాలి. ఇక, ఈ మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ బౌలింగ్ చేసిన తీరును అంతా మెచ్చుకుంటున్నారు. అతడి బౌలింగ్ సూపర్ అని.. దీన్నే కంటిన్యూ చేయాలని కోరుకుతున్నారు. ఆల్రెడీ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో డెబ్యూ ఇచ్చిన ఈ పేసర్‌ను బంగ్లాదేశ్ సిరీస్‌లో టీమ్‌లోకి తీసుకోవడం పక్కా అని చెబుతున్నారు. సెలెక్టర్లు అతడి బౌలింగ్‌కు ఫిదా అవడం ఖాయం అంటున్నారు. మరి.. ఆకాశ్‌దీప్ భారత జట్టులోకి వస్తాడా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
FIVE WICKET HAUL BY AKASH DEEP. 🌟
– 9 wickets in the Duleep Trophy match, he’s making a statement! pic.twitter.com/T1NJGfLwtk
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024