IPL 2025: RCB అతడ్ని తీసుకోవాలనుకుంటే దండగే.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Akash Chopra saysRCB will not retain Faf du Plessis and Glenn Maxwell: ఆర్సీబీ నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కోసం ఆ ప్లేయర్ ను తీసుకుంటే దండగే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

IPL 2025 మీదే అందరి దృష్టి ఉంది. మెగా వేలానికి, టోర్నీ ఆరంభానికి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎవరిని రిటైన్ చేసుకోవాలి? ఎవరిని జట్టులోనుంచి తప్పించాలి? అన్న విషయాలపై కసరత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ను రిటైన్ చేసుకోదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ ను కూడా తీసుకోదని అభిప్రాయపడ్డాడు.

Show comments