డ్రైవర్ కాలర్ పట్టుకున్న గంభీర్.. భయంతో వణికిపోయిన మాజీ క్రికెటర్!

Gautam Gambhir Grabbed The Driver's Collar: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎంత అగ్రెసివ్​గా ఉంటాడో తెలిసిందే. ప్లేయర్​గా ఉన్నప్పటి నుంచి అతడు దూకుడుగానే ఉంటున్నాడు. అయితే తనతో మంచిగా ఉంటే ప్రాణం ఇచ్చే గౌతీ.. కాస్త తేడా వచ్చినా గొడవకు దిగిపోతాడు.

Gautam Gambhir Grabbed The Driver's Collar: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎంత అగ్రెసివ్​గా ఉంటాడో తెలిసిందే. ప్లేయర్​గా ఉన్నప్పటి నుంచి అతడు దూకుడుగానే ఉంటున్నాడు. అయితే తనతో మంచిగా ఉంటే ప్రాణం ఇచ్చే గౌతీ.. కాస్త తేడా వచ్చినా గొడవకు దిగిపోతాడు.

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎంత అగ్రెసివ్​గా ఉంటాడో తెలిసిందే. ప్లేయర్​గా ఉన్నప్పటి నుంచి అతడు దూకుడుగానే ఉంటున్నాడు. అయితే తనతో మంచిగా ఉంటే ప్రాణం ఇచ్చే గౌతీ.. కాస్త తేడా వచ్చినా గొడవకు దిగిపోతాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోనూ అతడు పలుమార్లు బాహాబాహీకి దిగడం తెలిసిందే. ఐపీఎల్ టైమ్​లో ఒకసారి ఆటగాడిగా ఉన్నప్పుడు, మరోమారు మెంటార్​గా ఉన్నప్పుడు కింగ్​తో గొడవకు దిగి సంచలనంగా మారాడు గంభీర్. అయితే గౌతీ ఓ ట్రక్ డ్రైవర్​తో ఫైట్ చేసిన ఘటన గురించి చాలా మందికి తెలియదు. డ్రైవర్ కాలర్ కూడా పట్టుకున్నాడట గంభీర్. అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? డ్రైవర్​తో అతడు ఎందుకు కయ్యానికి దిగాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఢిల్లీకి చెందిన గంభీర్ డొమెస్టిక్ క్రికెట్​ అదే స్టేట్ టీమ్​కు ఆడాడు. అక్కడ రాణించడం ద్వారా మంచి పేరు రావడంతో ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి స్టోరీ అంతా తెలిసిందే. ప్లేయర్​గా దేశానికి ఎంతో సేవ చేసిన గౌతీ.. ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్​గా పని చేస్తున్నాడు. అయితే అతడి కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ ఘటన గురించి మాజీ క్రికెటర్, గౌతీ సహచరుడు ఆకాశ్ చోప్రా తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గంభీర్ ఎంతో కష్టపడేవాడని.. తనను తాను బెటర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండేవాడని అన్నాడు. బ్యాట్​తో చెలరేగాలని.. పరుగుల వరద పారించాలని చాలా ప్యాషనేట్​గా ఉండేవాడని తెలిపాడు. కానీ అతడికి ముక్కు మీద కోపం ఉండేదన్నాడు. ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఉంటాడని.. దాన్ని తప్పుబట్టలేమని చెప్పాడు ఆకాశ్ చోప్రా. ఒకసారి ట్రక్ డ్రైవర్​తో గొడవకు దిగాడని.. అది చూసి తాను భయంతో వణికిపోయానని పేర్కొన్నాడు.

‘ఒకసారి ట్రక్ డ్రైవర్​తో గొడవకు దిగాడు గంభీర్. ఇది ఢిల్లీలో జరిగింది. కారు దిగిన గౌతీ.. నేరుగా ట్రక్ ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. అతడు బండిని రాంగ్ టర్న్ చేయడమే గాక తీవ్ర పదజాలంతో బూతులు తిట్టాడు. దీంతో గంభీర్ ఆగ్రహాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. కోపంతో కారు దిగి ట్రక్ డ్రైవర్ కాలర్ పట్టేసుకున్నాడు. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని గంభీర్​ను ఆపేందుకు ప్రయత్నించా’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తాను ఆపేందుకు ట్రై చేశానని.. కానీ గౌతీ మాట వినలేదన్నాడు. అదే గంభీర్ అని.. తప్పు జరిగితే అతడు తట్టుకోలేడని తెలిపాడు. టీమిండియా కోచ్ గురించి ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. గంభీర్ యాటిట్యూడ్​ కరెక్ట్ అని అంటున్నారు. మంచి కోసం ఫైట్ చేయడం, చెడు జరిగితే ఊరుకోకపోవడం అతడి నైజం అని చెబుతున్నారు. ఆ గుణమే అతడ్ని మిగతా క్రికెటర్ల కంటే స్పెషల్​గా మార్చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments