iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ IPL వేలంలోకి వస్తే 42 కోట్లు పక్కా.. టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • Published Dec 21, 2023 | 6:06 PM Updated Updated Dec 21, 2023 | 6:06 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ వేలంలోకి వస్తే.. రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ వేలంలోకి వస్తే.. రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా. ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: కోహ్లీ IPL వేలంలోకి వస్తే 42 కోట్లు పక్కా.. టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

మిచెల్ స్టార్క్.. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులందరూ ఈ ఆటగాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్ 2024 వేలంలో ఇతడిని రూ. 24.75 కోట్ల భారీ ధరకు కోల్ కత్తా నైట్ రైడర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక స్టార్క్ పై ఇన్ని కోట్లు కుమ్మరించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ ధర ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. స్టార్క్ తో పాటుగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సైతం రూ. 20.50 కోట్ల భారీ ధరకు అమ్ముడై.. రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్లు అయిన ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్లేయర్ల కంటే విదేశీ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ మెుత్తంలో డబ్బులు వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు.

ఐపీఎల్ వేలంలో టీమిండియా ఆటగాళ్లకు తక్కువ ధర, విదేశీ ఆటగాళ్లకు ఎక్కువ ధర పెట్టడంపై టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచాడు. భారత స్టార్ ప్లేయర్లు అయిన మహ్మద్ షమీ, రోహిత్ శర్మ లతో పాటుగా జస్ప్రీత్ బుమ్రాలు విదేశీ ప్లేయర్ల కంటే తక్కువ మెుత్తం తీసుకుంటున్నారని రైనా చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన మరో మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విరాట్ కోహ్లీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు మాట్లాడుతూ..

“టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ వేలంలోకి వస్తే.. రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడు. అయితే ఇందుకు ఐపీఎల్ రూల్స్ సవరించాల్సి వస్తుంది. ఇక ఒక్కో ఫ్రాంచైజీ దగ్గర డబ్బులను రూ. 200 కోట్లకు పెంచాలి. ఇందులో భారత ప్లేయర్ల కోసం రూ. 150 కోట్లు ఖర్చు పెట్టాలని ఓ కండీషన్ పెట్టాలి. ఇక మిగతా 50 కోట్లను విదేశీ ఆటగాళ్ల కోసం వినియోగించాలి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆకాశ్ చోప్రా. కాగా.. టీమిండియా స్టార్లు అయిన బుమ్రా రూ.12 కోట్లు, మహ్మద్ షమీ రూ.5 కోట్లు, ధోని కూడా కేవలం రూ. 12 కోట్లకే తమ తమ ఫ్రాంచైజీలకు ఆడుతున్నారని, ఇది వారి సత్తాకు తగిన డబ్బు కాదని రైనా, చోప్రాలు అభిప్రాయపడ్డారు. ఇక 8 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడని ఆటగాడికి రూ. 24.75 కోట్లు ఖర్చుపెట్టడం కరెక్ట్ కాదని వారు పేర్కొన్నారు. మరి విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే.. 42 కోట్లు పలుకుతాడు అన్న ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.