Tirupathi Rao
Ajit Agarkar Clarity On Not Picking Ruturaj Gaikwad: టీమిండియా.. శ్రీలంక టూర్ కి వెళ్లేందుకు రెడీ అయిపోతోంది. ఈ టూర్ కి సంబంధించి ఇప్పటికే జట్లను కూడా ప్రకటించారు. అయితే ఆ టీమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై అతని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Ajit Agarkar Clarity On Not Picking Ruturaj Gaikwad: టీమిండియా.. శ్రీలంక టూర్ కి వెళ్లేందుకు రెడీ అయిపోతోంది. ఈ టూర్ కి సంబంధించి ఇప్పటికే జట్లను కూడా ప్రకటించారు. అయితే ఆ టీమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై అతని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Tirupathi Rao
ఇటీవల శ్రీలంక టూర్ కు సంబంధించి టీమిండియా వన్డే జట్టు, టీ20 జట్లను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ప్రకటన చుట్టూ చాలానే వివాదాలు, విమర్శలు, వ్యతిరేకత రాజుకొంది. కొందరు పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉంటే.. ఇంకొందరు మాత్రం రుతురాజ్ గైక్వాడ్ కు అసలు చోటే కల్పించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అసలు రుతురాజ్ గైక్వాడ్ కు ఎందుకు చోటు కల్పించలోదే చెప్పాలంటూ డిమాండ్లను కూడా లేవనెత్తారు. అయితే ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ కి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. టీమ్ సెలక్షన్ జరిగిన తర్వాత ఎక్కువ మంది రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కలేదు అనే విషయాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నారు. రుతురాజ్ ఫ్యాన్స్.. తమ అభిమాన ఆటగాడికి కావాలనే అవకాశం దక్కించడం లేదు అంటూ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పోలిస్తే.. రుతురాజ్ గణాంకాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. కానీ, రుతురాజ్ కు చోటు కల్పించకపోవడం, గిల్ ని వైస్ కెప్టెన్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయంపై కూడా చీఫ్ సెలక్టర్ అగార్కర్ కామెంట్స్ చేశాడు. అందరికీ ఆ బాధ ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు.
అగార్కర్ మాట్లాడుతూ.. “ఒక్కోసారి అద్భుతమైన ఆటగాడికి కూడా చోటు దక్కకపోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వన్డే టీమ్ లో లేకపోవడం)ది మాత్రమే బాధ కాదు. జట్టులో చోటు దక్కకపోతే ప్రతి ఆటగాడు అలాగే బాధ పడతాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని రింకూ సింగ్ కూడా అలాగే బాధ పడ్డాడు. అతను టీ20 వరల్డ్ కప్ ముందు ఎంతో అద్భుతంగా రాణించాడు. మేము సెలక్టర్లుగా జట్టులోకి కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకోగలం. అలాగే జట్టులో కాంబినేషన్ కి తగినట్లు ఆటగాళ్ల సెలక్షన్ ఉంటుంది. అలాంటి సమయంలో కొన్నిసార్లు బాగా రాణించినా చోటు దక్కకపోవచ్చు” అంటూ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరో వివాదానికి తెరె లేపినట్లు అయ్యింది. వివరణలో కూడా రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ చోటు కల్పించకపోవడాన్ని చెప్పడాన్ని తప్పుబడుతున్నారు. మరి.. అజిత్ అగార్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.