SNP
Ajinkya Rahane, David Miller, IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని పట్టిన ఓ క్యాచ్ బాగా వైరల్ అవుతోంది. కానీ ఆ దాన్ని మించిన క్యాచ్ ఇదే మ్యాచ్‌లో ఒకటి చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Ajinkya Rahane, David Miller, IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని పట్టిన ఓ క్యాచ్ బాగా వైరల్ అవుతోంది. కానీ ఆ దాన్ని మించిన క్యాచ్ ఇదే మ్యాచ్‌లో ఒకటి చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్, సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. సీఎస్‌కే బౌలర్ డారిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ మూడో బాల్‌కు టైటాన్స్ ఆటగాడు విజయ్ శంకర్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, అది ఎడ్జ్ తీసుకోని.. వికెట్ కీపర్ ధోనికి కుడివైపు చాలా దూరంగా వెళ్లింది. ఆ బాల్‌ను గాల్లోకి అమాంతం దూకి.. సూపర్ క్యాచ్ అందుకున్నాడు ధోని. ఈ క్యాచ్ చూసిన ధోని ఇంకా ఇంత ఫిట్‌గా ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం కంటే.. ధోని పట్టిన క్యాచే హైలెట్‌గా మారింది. కానీ, ధోని పట్టిన క్యాచ్‌ను మించి మరో అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. కానీ, ధోనికి వచ్చినంత గుర్తింపు ఆ క్యాచ్‌కు రాలేదు. కానీ, ధోని కంటే అదే బెస్ట్ క్యాచ్. అలాంటి స్టన్నింగ్ క్యాచ్ పట్టింది కూడా ఓ గొప్ప క్రికెటరే. అతనే టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానె.
నిజానికి రహానె పట్టిన ఆ సూపర్ క్యాచ్‌తోనే మ్యాచ్ సీఎస్‌కే చేతుల్లోకి వచ్చింది. 16 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి డేంజరస్‌గా మారుతున్న డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను రహానె వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి.. ముందు డైవ్ చేస్తూ ఎంతో అద్భుతంగా అందుకున్నాడు. సీఎస్‌కే బౌలర్ తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ 5వ బంతిని డేవిడ్ మిల్లర్ భారీ షాట్ ఆడాడు.. ఆ బాల్‌ను బౌండరీ లైన్ నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి.. ముందుకు ఫుల్‌లెంగ్త్ డైవ్ కొట్టి.. కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 35 ఏళ్ల వయసులో కూడా రహానె ఇలాంటి ఫుల్‌లెంత్ డైవ్ కొట్టి అద్భుతమైన క్యాచ్ అందుకోవడం విశేషం. కానీ, ఈ క్యాచ్ కంటే కూడా ధోని పట్టిన క్యాచ్ బాగా వైరల్ అయింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా బౌండరీ లైన్ వద్ద రహానె అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. విరాట్ కోహ్లీని తన సూపర్ ఫీల్డింగ్‌తో అవుట్ చేశాడు రహానె.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 46, రచిన్ రవీంద్ర 46 పరుగులతో సూపర్ స్టార్ట్ ఇచ్చారు. రహానె 12 రన్స్ మాత్రమే చేసినా.. శివమ్ దూబే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 51 పరుగులు చేసి దుమ్మురేపాడు. డారిల్ మిచెల్ సైతం 24 పరుగులు చేశాడు. దీంతో సీఎస్‌కేకు భారీ స్కోర్ దక్కింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లతో రాణించాడు. ఇక 207 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్.. 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి కేవలం 148 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. జీటీలో సాహా 21, సాయి సుదర్శన్ 37, మిల్లర్ 21 రన్స్‌తో పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తఫిజుర్ రెహమాన్, దేశ్‌పాండే తలో రెండు వికెట్లతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో రహానె సూపర్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
AN ABSOLUTE STUNNER BY AJINKYA RAHANE…!!! 🫡💥pic.twitter.com/YWlQO8elFA
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024