IND vs WI: సింగిల్‌ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన రహానే

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన భారత్‌.. వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కట్టడి చేస్తోంది. మూడో రోజు వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో వెస్టిండీస్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అయినప్పటికీ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్‌ ఆటగాడు అంజిక్యా రహానే ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. నమ్మశక్యంకానీ రితీలో రహానే అందుకున్న ఆ క్యాచ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 87వ ఓవర్‌ మూడో బంతిని బ్లాక్‌ వుడ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఇషాన్‌ కిషన్‌ దాన్ని అందుకోలేకపోవడంతో.. గ్లౌజ్‌ను తాకుతూ.. ఫస్ట్‌ స్లిప్‌కు లెఫ్ట్‌ సైడ్‌కు వెళ్లింది. మెరుపు వేగంతో తన లెఫ్ట్‌ సైడ్‌కు డైవ్‌ చేస్తూ రహానే ఒంటి చేత్తో దాన్ని అద్భుతంగా అందుకున్నాడు. నమ్మశక్యం కానీ రితీలో రహానే క్యాచ్‌ అందుకోవడంతో విండీస్‌ బ్యాటర్‌ బ్లాక్‌వుడ్‌ కళ్లు తేలేశాడు.

పిచ్‌ స్టోగా ఉన్నందున టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డారు. ఇలాంటి కష్టసయమంలో రహానే తన వయసును మర్చిపోయి ఇలాంటి కళ్ల చెదిరే క్యాచ్‌ పట్టి జట్టులో ఉత్సాహం నింపాడు. ప్రస్తుతం రహానే వయసు 35 ఏళ్లు. ఈ ఏజ్‌లో కూడా రహానే ఇలాంటి క్యాచ్‌ పట్టడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రహానే ‍పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రహానే కెరీర్‌లో ఇది 102వ క్యాచ్‌ కావడం విశేషం. కిందున్న వీడియో చూసి రహానే పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 13 ఏళ్లలో 3 వికెట్లు తీశాడు! ఇలా అయితే టీమిండియా మరో వెస్టిండీసే!

Show comments