CSK vs GT: చెన్నై ఓటమికి కారణం అతనే! టీమ్‌లో దండగా..

Ajinkya Rahane, CSK vs GT, IPL 2024: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమికి కారణం ఓ సీనియర్‌ ప్లేయర్‌ అంటూ క్రికెట్‌ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి ఆ క్రికెట్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Ajinkya Rahane, CSK vs GT, IPL 2024: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమికి కారణం ఓ సీనియర్‌ ప్లేయర్‌ అంటూ క్రికెట్‌ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి ఆ క్రికెట్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సీఎస్‌కే తమ ప్లే ఆఫ్స్‌ ఛాన్సులను మరింత క్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సీఎస్‌కే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా.. ప్లే ఆఫ్స్‌ కష్టమే. అయితే.. శనివారం అహ్మాదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓటమికి ఓ సీనియర్‌ ప్లేయర్‌ కారణం అంటూ సీఎస్‌కే అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆ సీనియర్‌ ప్లేయర్‌ ఎవరు? ఎలా చెన్నై ఓటమికి కారణం అయ్యాడో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో చెన్నై ముందు 232 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది గుజరాత్‌ టైటాన్స్‌. ఈ టఫ్‌ టార్గెట్‌ను ఛేదించేందుకు సీఎస్‌కే రుజరాత్‌ గైక్వాడ్‌, రచిన్‌ రవీంద్ర జోడీని పంపుతుంది అనుకుంటే.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో అజింక్యా రహానెను పంపింది. ఈ సీజన్‌లో రహానె దారుణంగా విఫలం అవుతున్నాడు. 232 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయాలంటే.. పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. కానీ, రహానె ఫామ్‌లేమితో అది సాధ్యం కాలేదు. పైగా రచిన్‌ రవీంద్రను రన్‌ అవుట్‌ కూడా చేయించాడు. టీ20 క్రికెట్‌కు పెద్దగా పనికి రాని రహానెపై సీఎస్‌కే ఎక్కువ ఆధారపడుతుందని, అందుకే ఇలాంటి ఓటములు ఎదరువుతున్నాయని, ఇకనైనా మేలుకోకుంటే.. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కష్టమే అంటున్నారు ఆ టీమ్‌ అభిమానులు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ 51 బంతుల్లో 103, శుబ్‌మన్‌ గిల్‌ 55 బంతుల్లో 104 పరుగులు చేసి సెంచరీలతో దుమ్మురేపారు. సీఎస్‌కే బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే 2 వికెట్లతో రాణించాడు. 232 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓటమి పాలైంది. డారిల్‌ మిచెల్‌(63), మొయిన్‌ అలీ(56) మినహా ఇతర బ్యాటర్లు విఫలం అయ్యారు. ధోని చివర్లో 11 బంతుల్లో 26 పరుగులు చేసి తన అభిమానులను అలరించాడు. ఈ ఓటమితో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ ఛాన్సులు కష్టంగా మారాయి. మరి ఈ మ్యాచ్‌ ఓటమికి రహానె కారణం అంటూ వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments