iDreamPost
android-app
ios-app

మారని సంజూ శాంసన్ ఆట.. మద్ధతిచ్చిన వాళ్లే విమర్శిస్తున్నారు!

IND vs SL- Again Sanju Samson Got Out For Duck: టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. సిరీస్ ని కైవసం కూడా చేసుకున్నారు. కానీ, సంజూ శాంసన్ ఆటతీరు మాత్రం విమర్శకులనే కాదు.. అభిమానులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్నాళ్లు మద్దతిచ్చిన అభిమానులు కూడా విమర్శిస్తున్నారు.

IND vs SL- Again Sanju Samson Got Out For Duck: టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. సిరీస్ ని కైవసం కూడా చేసుకున్నారు. కానీ, సంజూ శాంసన్ ఆటతీరు మాత్రం విమర్శకులనే కాదు.. అభిమానులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్నాళ్లు మద్దతిచ్చిన అభిమానులు కూడా విమర్శిస్తున్నారు.

మారని సంజూ శాంసన్ ఆట.. మద్ధతిచ్చిన వాళ్లే విమర్శిస్తున్నారు!

టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక 2024లో టీమిండియా టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. తొలి రెండు టీ20 మ్యాచుల్లో టీమిండియా అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. అదే పల్లెకల్లే స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ లో మాత్రం టీమిండియా తడబాటు స్పష్టంగా కనిపించింది. టాపార్డర్ కేవలం 30 పరుగులకే పేకమేడలా కూలిపోయింది. అయితే అందరూ ఇప్పుడు సంజూ శాంసన్ ప్రదర్శన గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అతడిని ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన.. చేస్తున్న ఫ్యాన్స్ కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎందుకంటే సంజూ శాంసన్ వరుసగా డకౌట్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూడు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో సంజూ శాంసన్ కు అవకాశం దక్కలేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ అంతా సంజూకి అన్యాయం చేస్తున్నారు.. అతని టాలెంట్ ని తొక్కేస్తున్నారు అంటూ ద్వజమెత్తారు. సరే అని రెండో మ్యాచ్ లో అతనికి అవకాశం కల్పించారు. అయితే రెండో టీ20లో సంజూ శాంసన్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. అప్పుడు కూడా సంజూకి నెట్టింట అస్సలు మద్దతు తగ్గలేదు. ఒక్క అవకాశం ఇచ్చి.. తొలి ప్రయత్నంలో డకౌట్ అయితే విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే రెండో మ్యాచ్ లో కూడా సంజూ శాంసన్ ఆట తీరు మారలేదు. సిరీస్ లో ఆఖరి టీ20లో అవకాశం దక్కించుకున్న సంజూ 4 బంతులు ఎదుర్కొని మళ్లీ డకౌట్ అయ్యాడు. ఇన్నాళ్లు మద్దతిచ్చిన అభిమానులే ఇప్పుడు సంజూపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంజూకి అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ అతని అభిమానులు ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే అతని ఆట తీరు గతంలో కూడా ఇలాగే ఉండేది అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అప్పుడు కూడా వచ్చిన అవకాశాలను ఇలాగే సద్వినియోగం చేసుకోలేకపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ గా పెవిలియన్ కు చేరితే ఎలాంటి అవకాశాలు దక్కుతాయి అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలకు సంజూ శాంసన్ నుంచి ఎలాంటి రిప్లయ్ వస్తుందో చూడాలి. అది మాట ద్వారా కావచ్చు.. బ్యాటు ద్వారా కావచ్చు.. రియాక్ట్ అవుతాడా అనే ప్రశ్న అయితే ఉంది. ఇంకొందరు ఐపీఎల్ ను ఉదాహరణగా చూపి కూడా విమర్శిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచుల్లో అయితే సంజూ విజృంభిస్తాడు.. టీమిండియా తరఫున అయితే మాత్రం ఇలాంటి ప్రదర్శన చేస్తాడు అంటూ పెదవి విరుస్తున్నారు. మరి.. రెండు మ్యాచుల్లో సంజూ శాంసన్ వరుసగా డకౌట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.