Jasprit Bumrah: ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో నలుగురికే సాధ్యమైన ఘనత!

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా టెస్టుల్లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచి.. ఒక అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఆ రికార్డ్‌ ఏంటి? ఆ రికార్డ్‌తో హేడెన్‌, పాంటింగ్‌, కోహ్లీకి ఏంటి సంబంధం లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా టెస్టుల్లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచి.. ఒక అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఆ రికార్డ్‌ ఏంటి? ఆ రికార్డ్‌తో హేడెన్‌, పాంటింగ్‌, కోహ్లీకి ఏంటి సంబంధం లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ క్రికెట్‌లో కొన్ని రికార్డ్స్‌ చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. అలాంటి ఓ రికార్డునే తాజాగా టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బుమ్రా.. తన ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మెరుగు పర్చుకున్నాడు. తొలిసారి టెస్ట్‌ క్రికెట్‌లో బుమ్రా ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు. ఇప్పటికే చాలా మంది టెస్టుల్లో నంబర్‌ వన్‌ బౌలర్లు అయ్యారు కదా.. ఇందులో గొప్పేముంది అనుకోవచ్చు. కానీ, టెస్టులతో పాటు గతంలో వన్డేలు, టీ20ల్లో కూడా బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలా మూడు ఫార్మాట్స్‌లోనూ నంబర్‌ వన్‌ స్థానం అధిరోహించిన తొలి బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.

ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ బౌలర్‌ కూడా.. మూడు ఫార్మాట్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలువలేదు. ఒకే సారి కాకపోయినా.. ఏదో ఒక సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్ట్‌, వన్డే, టీ20ల్లో వరల్డ్‌ నంబర్‌ బౌలర్‌ అయినా ఏకైక బౌలర్‌ బుమ్రానే. అందుకే.. ఇది చాలా అరుదైన రికార్డ్‌. బౌలర్లలో ఇదే ఫస్ట్‌టైమ్‌ కానీ, బ్యాటింగ్‌ విభాగంలో ఈ రికార్డును ఓ ముగ్గురు ఆటగాళ్లు కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు మామూలు ఆటగాళ్లు.. వాళ్ల హయాంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆటగాళ్లు. ఆ ముగ్గురే.. మ్యాథ్యూ హేడెన్‌, రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లీ. ఆస్ట్రేలియాకు చెందిన హేడెన్‌, పాంటింగ్‌.. ఇద్దరు ఒకే జనరేషన్‌ ప్లేయర్లు. వాళ్లు టీమ్‌లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌కు రారాజుగా తన ఆధిపత్యం చెలాయించింది.

బుమ్రా కంటే.. మూడు ఫార్మాట్స్‌లోనూ నంబర్‌ వన్‌ ప్లేయర్‌గా నిలిచిన ఏకైక ఆసియా ఆటగాడు విరాట్‌ కోహ్లీ. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కోహ్లీ ఎప్పుడో.. నంబర్‌ వన్‌ చాలా కాలం కొనసాగాడు. హేడెన్‌, పాంటింగ్‌, కోహ్లీ తర్వాత ఇప్పుడు బుమ్రా ఈ రికార్డు సాధించిన నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. వీరి నలుగురికి మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. ఒకటి రెండు ఫార్మాట్స్‌కే స్టిక్‌ అవుతున్న ఈ కాలంలో.. మూడు ఫార్మాట్స్‌లోనూ అదరగొడుతూ.. వరల్డ్‌ నంబర్‌ వన్లుగా నిలవడం మామూలు విషయం కాదు. అలాంటి రికార్డును సాధించిన ఈ నలుగురు ఆటగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments