Nidhan
క్రికెట్లో ఎన్నో డిఫరెంట్ షాట్స్ ఉన్నాయి. అయితే ఇది మాత్రం వాటి కంటే చాలా స్పెషల్ షాట్. తలెత్తకుండా కొడితే బాల్ స్టేడియం బయటకెళ్లి పడింది.
క్రికెట్లో ఎన్నో డిఫరెంట్ షాట్స్ ఉన్నాయి. అయితే ఇది మాత్రం వాటి కంటే చాలా స్పెషల్ షాట్. తలెత్తకుండా కొడితే బాల్ స్టేడియం బయటకెళ్లి పడింది.
Nidhan
క్రికెట్లో చాలా రకాల షాట్స్ ఉన్నాయి. కొన్ని షాట్స్ చూస్తుంటే అలా ఎలా కొడతార్రా బాబు అనిపిస్తుంది. బుక్ షాట్స్‌కు భిన్నంగా ప్రయత్నిస్తూ బంతుల్ని బౌండరీలకు తరలించే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ షాట్, సూర్యకుమార్ యాదవ్ సుప్లా షాట్, గ్లెన్ మాక్స్వెల్ రివర్స్ స్వీప్ అలాంటివే. ఇలాంటి షాట్లు ఆడే బ్యాటర్లకు బంతులు ఎలా వేయాలో బౌలర్లకు అర్థం కాదు. అందుకే ఎలాగైనా వాళ్లు ఔటైతే బాగుండు కదా అని ప్రార్థిస్తూ ఉంటారు. అలా భిన్నమైన షాట్లతో విరుచుకుపడే అతికొద్ది మంది బ్యాటర్లలో ఆఫ్ఘానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ కూడా ఒకడు. అతడు కొట్టిన తాజా షాట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తలెత్తకుండా అతడు బాదిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘానిస్థాన్ నెగ్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఐర్లాండ్.. అన్ని ఓవర్లు ఆడి 142 పరుగులే చేయగలిగింది. దీంతో 10 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆఫ్ఘాన్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ కొట్టిన ఓ సిక్స్ చాలా స్పెషల్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మెకర్తీ బౌలింగ్‌లో నో లుక్ షాట్ కొట్టాడు రషీద్. లెగ్ సైడ్ దిశగా పడిన ఫుల్ టాస్‌ను తలెత్తకుండానే భారీ షాట్‌గా మలిచాడతను. బాల్‌ను ఆఖరి సెకన్ వరకు గమనించిన రషీద్.. తన బ్యాట్‌ను మెరుపు వేగంతో తిప్పుతూ తలను కిందకు వంచాడు. బాల్‌ను కనెక్ట్ చేసే టైమ్‌లో అతడు దాని వంక చూడలేదు.
బాల్ రావడం, రషీద్ దాని వైపు చూస్తూ తలను కిందకు అని బ్యాట్‌ను ఊపడం, సరిగ్గా కనెక్ట్ అయిన బాల్ రివ్వున వెళ్లి స్టాండ్స్‌లో పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఐర్లాండ్ టీమ్‌తో పాటు ఆఫ్ఘాన్ జట్టు కూడా ఏం జరిగిందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. సాధారణంగా ఏ బ్యాటర్ అయినా షాట్ కంప్లీట్ అయి బాల్ గాల్లో ట్రావెల్ చేసేదాకా, కొన్ని సార్లు గ్రౌండ్‌ను బాల్ టచ్ అయి దూసుకెళ్లే వరకు దాన్నే గమనిస్తారు. కానీ రషీద్ మాత్రం నేను కొట్టేశాను, దాని పని అది చూసుకుంటుంది అనేలా నో లుక్ షాట్‌తో అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. షాట్ పూర్తయిందే తడవు దాని వైపే చూడకుండా కిందకు తల వంచుకొని అదే పోజులో నిలబడ్డాడు. ఈ షాట్ చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. సూపర్బ్ బ్యాటింగ్ రషీద్.. ఇదే తరహాలో ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రషీద్ నో లుక్ షాట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
The swag in Rashid Khan’s shot. pic.twitter.com/N7eDsfA7Ii
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024