KKR కు గుడ్ న్యూస్.. విధ్వంసకర శతకంతో చెలరేగిన స్టార్ ప్లేయర్!

Rahmanullah Gurbaz: యూఏఈతో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్.

Rahmanullah Gurbaz: యూఏఈతో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్.

ఐపీఎల్ 2024.. ప్రస్తుతం అందరి చూపు ఈ మెగాటోర్నీపైనే ఉంది. మినీ వేలం ముగిసిన తర్వాత జట్ల బలాబలాలు అందరికీ తెలిసిపోయాయి. ఈ క్రమంలోనే తమ టీమ్ కొనుగోలు చేసినా, ఇప్పటికే టీమ్ లో ఉన్న ప్లేయర్లు ప్రస్తుతం ఆడుతున్న సిరీస్ లపై ఓ కన్నేసి చూస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే కోల్ కత్తా టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఫ్గాన్ యువ ఓపెనర్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. యూఏఈతో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్.

యూఏఈతో జరుగుతున్న 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఆఫ్గాన్ విజయంతో ఆరంభించింది. షార్జా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 72 పరుగులతేడాతో యూఏఈని ఓడించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. పసికూన బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు గర్బాజ్. కాగా.. అతడికి టీ20ల్లో తొలి శతకం కావడం విశేషం. గుర్బాజ్ తుఫాన్ ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 రన్స్ కే పరిమితం అయ్యింది. అయితే గుర్బాజ్ తాజా శతక ఇన్నింగ్స్ తో కేకేఆర్ ఫ్యాన్స్, యాజమాన్యం ఫుల్ ఖుషీగా ఉంది. ఎందుకంటే? ప్రస్తుతం అతడు కేకేఆర్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా ఆడాడు. ఇక ఐపీఎల్ లో 11 మ్యాచ్ లు ఆడిన గుర్బాజ్ 133 స్ట్రైక్ రేట్ తో 227 పరుగులు చేశాడు. మరి ఆఫ్గాన్ ప్లేయర్ విధ్వంసకర శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments