Afghanistan: ప్రపంచ క్రికెట్​కు షాక్! ఆఫ్ఘానిస్థాన్ టీమ్​పై బ్యాన్?

Afghanistan Cricket At Risk Of Ban: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్​కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఆ టీమ్​పై బ్యాన్ తప్పదని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

Afghanistan Cricket At Risk Of Ban: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్​కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఆ టీమ్​పై బ్యాన్ తప్పదని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్​లో ఎన్నో టీమ్స్ ఉన్నాయి. కానీ బిగ్ టీమ్స్ అంటే ఆరేడు జట్ల కంటే ఎక్కువ కనిపించవు. చాలా దేశాలు జెంటిల్మన్ గేమ్​లోకి ఎంట్రీ ఇచ్చినా నిలబడలేకపోయాయి. కొన్ని పసికూనల్లా మిగిలిపోతే.. మరికొన్ని మాత్రం కాస్త పెద్ద స్థాయికి చేరుకున్నాయి. అయితే వీటన్నింటి కంటే ఆఫ్ఘానిస్థాన్ డిఫరెంట్ అనే చెప్పాలి. తక్కువ సమయంలోనే ఆ టీమ్ పెద్ద జట్లకు కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి చేరుకుంది. నాలుగైదేళ్ల గ్యాప్​లోనే అనూహ్యంగా ఎదిగిన ఆఫ్ఘాన్ టీమ్.. ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించి తాము పసికూనలం కాదని ప్రూవ్ చేసింది. టీ20 ప్రపంచ కప్​-2024లో ఏకంగా సెమీస్​కు చేరుకుని చరిత్ర సృష్టించింది. వచ్చే కొన్నేళ్లలో వరల్డ్ క్రికెట్​లో మరింత బలమైన జట్టుగా మారేందుకు పరుగులు పెడుతున్న ఆఫ్ఘాన్ గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ టీమ్​పై బ్యాన్ తప్పదని తెలుస్తోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​లో క్రికెట్​ను బ్యాన్ చేయాలని అక్కడి తాలిబన్ల ప్రభుత్వం నిర్ణయించినట్లు వినిపిస్తోంది. ప్రజలపై అనేక ఆంక్షలు విధిస్తున్న అక్కడి సర్కారు.. క్రీడల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది. గేమ్స్​ను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆటలు ఆడకుండా నిషేధం విధించింది. ఇప్పుడు మెన్స్ గేమ్స్​ మీద కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం. అక్కడి సుప్రీం లీడర్ హిబతుల్లా, అకున్ జాదా ఆఫ్ఘాన్​లో క్రికెట్​పై క్రమంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే క్రికెట్​ను అధికారికంగా బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీని గురించి క్రికెట్ వరల్డ్​లో మాత్రం చర్చలు ఊపందుకున్నాయి. అంత మంచి టీమ్​ను నిషేధించాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Show comments